Trump Midterms: అగ్రరాజ్యంలో మిడ్ టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఈ గండం ఎలా గడుస్తుందా? అని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెన్షన్ అవుతున్నారు. ఎందుకంటే సర్వేలన్నీ దాదాపుగా ఆయనకు ప్రతికూలంగా వస్తున్నాయి. ఆయనకు యాక్సెప్టెన్సీ రేటింగ్స్ పడిపోతున్నాయ్. ఇలాంటి సమయంలో ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ సంస్థ నిర్వహించిన లేటెస్ట్ సర్వే ఫలితాలు కూడా టాక్ ఆఫ్ ది అమెరికాగా మారాయ్. ఈ సర్వేలో సుమారు 800 మంది దక్షిణాసియా అమెరికన్ ఓటర్లు పాల్గొనగా, వారిలో 87 శాతం మంది ఇండియన్ అమెరికన్లే ఉన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసిన దక్షిణాసియా అమెరికన్లలో ఏకంగా 25 శాతం మంది ఈసారి డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి ఆ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతు ఇచ్చిన వారిలో మాత్రం 96 శాతం మంది ఇప్పటికీ డెమోక్రాట్ల వైపే ఉన్నారు.
ఇప్పటికే టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ జోరుగా సాగుతోంది. అక్కడి ఓటర్లను కొన్ని కీలక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విపరీతంగా పెరిగిపోయిన కాస్ట్ ఆఫ్ లివింగ్, మెడికల్ ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, విద్యతో పాటు జాతి వివక్ష లాంటి సమస్యలు ఓటర్లలో అసంతృప్తిని రాజేస్తున్నాయ్. మరోవైపు, ఇరాన్ యుద్ధ పరిణామాలతో.. ద్రవ్యోల్బణ భయాలు మరింత పెరిగిపోయాయ్. ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు.. భారతీయ అమెరికన్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని సర్వేలో తేలింది.
మిడ్ టర్మ్ ఎన్నికల్లో స్వింగ్స్ స్టేట్స్ కూడా కీలకంగా మారాయ్. జార్జియా, పెన్సిల్వేనియా, మిషిగన్, టెక్సాస్ లాంటి కీలక రాష్ట్రాల్లో.. దక్షిణాసియా ఓటర్ల సంఖ్య గట్టిగానే ఉంది. అక్కడ పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతున్న తరుణంలో ఈ కొద్ది మార్పు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వ్యూహాత్మక వలస విధానాలు, పెరుగుతున్న వివక్ష ధోరణులు అమెరికా పొలిటికల్ ఈక్వేషన్స్‌ని మార్చేస్తున్నాయ్. గతంలో ట్రంప్ వెంటే ఉన్న దక్షిణాసియా ఓటర్లలో వచ్చిన మార్పు ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది.. నవంబర్ 3న వచ్చే ఫలితాలే తేల్చనున్నాయి. మిడ్‌టర్మ్ గండం నుంచి ట్రంప్ గట్టెక్కుతారా? లేదా? అనేది చూడాలి.
Also read: ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే