Akhanda 2..నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్న ఈయన డూప్ లేకుండా సీన్స్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. వయసుకు మించిన యాక్షన్ పాత్రలలో చేస్తూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో బోయపాటి శ్రీను(Boyapati Srinu), బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా సీక్వెల్ గా ‘అఖండ 2: తాండవం’ రాబోతోంది.
విడుదల తేదీపై నిర్మాతలలో సందిగ్ధత..
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ వేదికగా ఈ సినిమా షూటింగు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25వ తేదీన సినిమా విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు కూడా.. అయినా ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అఖండ 2 విడుదల తేదీ సెప్టెంబర్ 25ని వాయిదా వేద్దామని నిర్మాతలు అనుకుంటున్నారట. అయితే నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేయాలనుకుంటున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం సెప్టెంబర్ 25న విడుదలవుతుందని చెప్పడం గమనార్హం.
రాజా సాబ్ డేట్ కి ఎసరు పెట్టిన నిర్మాతలు..
అసలు విషయంలోకి వెళ్తే ప్రభాస్ (Prabhas), మారుతి(Maruthi ) కాంబినేషన్ లో వస్తున్న ‘రాజా సాబ్ ‘ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా వీఎఫ్ఎక్స్ సంతృప్తికరంగా లేకపోవడం వల్లే వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ రాజా సాబ్ (Rajasaab) సినిమా గనుక విడుదల వాయిదా పడితే.. డిసెంబర్ 5 కి అఖండ 2 ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ ఇది జరగకపోతే సినిమా సెప్టెంబర్ 25న విడుదల అయితే కచ్చితంగా దసరా మూమెంట్లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది అని కూడా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
అఖండ 2 సినిమా విశేషాలు..
అఖండ మూవీకి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ పేరుతో రూపొందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకం పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. బాలకృష్ణ చిన్న కూతురు ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. బాలకృష్ణ సరసన సంయుక్త మేనన్ హీరోయిన్ గా ఎంపిక కాగా ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక గత మూడు రోజులుగా ఈ సినిమా మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ALSO READ: Tollywood: పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్న నారా రోహిత్.. అదే సాకుతో ఎంట్రీ పక్కా!