E-Paper
Advertisement

Nivetha Thomas : హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ.. నిన్న శ్రీలీల..నేడు నివేథా!

Nivetha Thomas : హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ.. నిన్న శ్రీలీల..నేడు నివేథా!
Advertisement

Nivetha Thomas: సాధారణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఎన్నో విషయాలను చాలా సులభతరంగా మనం చేసుకోవచ్చు కానీ మనం ఈ టెక్నాలజీని సరైన విధానంలో వాడితేనే ప్రయోజనాలు ఉంటాయి కానీ తప్పుగా ఉపయోగిస్తే పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ(AI Techonology) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలను చాలా సులభంగా తెలుసుకోగలుగుతున్నాము అయితే సెలబ్రిటీల పాలిట ఏఐ అనేది పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పాలి.

ఆకతాయిలపై ఫైర్ అయిన నివేథా..

సెలబ్రిటీల ప్రమేయం లేకుండా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్ల ఫోటోలను మార్నింగ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆశ్చర్యంలో ఉన్నప్పటికీ సెలబ్రిటీలు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీ లీలకు(Sreeleela) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరో నటి కూడా నేటిజన్ ల తీరు పట్ల విమర్శలు కురిపించారు.

నివేదా థామస్ మార్ఫింగ్ ఫోటోలు..

Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో నివేథా థామస్ (Nivetha Thomas)ఒకరు. పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల 35 చిన్న కథ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత సక్సెస్ అందుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నివేథా ఇటీవల శారీలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ ఫోటోని కొంతమంది ఆకతాయిలు ఏఐ ద్వారా బోల్డుగా క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వ్యక్తిగత గోప్యత పై దాడి చేసినట్లే..

Advertisement

ఇలా బోల్డ్, గ్లామర్ లుక్ లో ఉన్న ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఈ ఫోటోలపై నివేదా థామస్ స్పందిస్తూ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఏఐ ద్వారా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారు వెంటనే వాటిని తొలగించాలని లేకపోతే చట్టపరమైన చర్యలను తీసుకుంటానంటూ ఈమె హెచ్చరించారు. ఇలా తన ప్రమేయం లేకుండా తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం అనేది తన వ్యక్తిగత గోప్యత పై దాడి చేసినట్లే అంటూ ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు నిజమైనవా? కాదా? అనే భ్రమలో అభిమానులు ఉన్నారు ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

Also Read: Suman Shetty: తనూజ, కళ్యాణ్ లవ్ ట్రాక్ పై సుమన్ శెట్టి కామెంట్స్.. అసలు నిజ ఇదే అంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×