Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు పడ్డాయి. ఆ వరుస సినిమాలో యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని తన వైపు తిప్పుకున్నాయి. ముఖ్యంగా యూత్లో పవన్ కళ్యాణ్ కి అప్పుడు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ క్రేజ్ వచ్చిందో, అప్పట్లో పవన్ కళ్యాణ్ కి అలాంటి అర్జున్ రెడ్డి సినిమాలో వరుసగా నాలుగు పడ్డాయి. అందుకే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ చెక్కుచెదరలేదు.
పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కొంత మంది ఫ్యాన్స్ దూరం అయిపోయారు అనేది ఎవరు ఒప్పుకోలేని వాస్తవం. అలానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూటమి ప్రభుత్వంతో కలవడంతో కూడా కొంతమంది ఫ్యాన్స్ దూరమైపోయారు. అందుకే ఇప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం వేరొకరికి ఓటేస్తామంటూ నినాదాలు చేస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఎదురయింది.
రీ రిలీజ్ డిజాస్టర్
ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే ఆ హీరో కెరియర్ లో ఉన్న సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేయడం అనేది మారిపోయింది. మహేష్ బాబు ఒక్కడు సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తమ్ముడు జల్సా సినిమాతో ఈ ట్రెండ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. దీంట్లో ఏమాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మాత్రం ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన సినిమాలను రీ రిలీజ్ చేసిన సినిమాలను, మళ్లీ రీ రిలీజ్ చేసే చేస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాకు సరైన ఆదరణ దక్కలేదు. నాగార్జున నటించిన రగడ సినిమాకి కూడా సరైన ఆదరణ దక్కలేదు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాని రీ రిలీజ్ చేశారు. మరి కొన్ని రోజుల్లో ఓజీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తమ్ముడు సినిమా కంప్లీట్ డిజాస్టర్ అని చెప్పాలి. ఒక్కచోట కూడా తమ్ముడు సినిమాకి సంబంధించి హౌస్ ఫుల్ కాలేదు. ముఖ్యంగా నైజాం నవాబ్ అని పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఉంటారు. అక్కడ కూడా బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి.
చెప్పినా వినలేదు
చాలా రోజులు తర్వాత పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక స్ట్రైట్ ఫిలిం విడుదలవుతుంది. ఈ తరుణంలో మళ్లీ సినిమాలు రీ రిలీజ్ వద్దు అని ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మొత్తుకున్నారు. అయితే ఇలా చెప్పినా కూడా వాళ్లే సినిమాలకు వస్తారులే అనుకొని ధీమాతో సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఒకచోట కూడా హౌస్ ఫుల్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మామూలుగా అవతల హీరో షోస్ ఫీల్ కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్లో రెచ్చిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది జరుగుతుంది.
Also Read: Nani: ఒక సినిమా పోవాలి అని కోరుకునే క్యారెక్టర్ కాదు నాది