Big producer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి ఫ్యూచర్ అయినా కూడా ఎక్కువగా సక్సెస్ ఫెయిల్యూర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది హీరోలు సక్సెస్ లో ఉంటే వరుసగా అవకాశాలు వస్తాయి. అలానే ఇండస్ట్రీలో నిర్మాతలకు విపరీతమైన కష్టాలు ఉంటాయి. ఎంతోమంది దర్శకులను పరిచయం చేసిన నిర్మాత అయినా కూడా ప్రస్తుతం ఆ దర్శకులు వేరే స్థాయిలో ఉండటం వలన వాళ్ళని సినిమా చేయమని అడిగే పరిస్థితులు కూడా ఉంటాయి.
నాకు మొదటి సినిమా ఇచ్చిన నిర్మాత కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలి అనేది కొంతమంది దర్శకుల ఆలోచనలో కూడా ఉంటుంది. అయితే దర్శకులు స్థాయి పెరిగిపోయిన తర్వాత భారీ బడ్జెట్ ను పెట్టె స్థాయిలో నిర్మాత ఉండకపోవచ్చు. అప్పుడు మళ్లీ దర్శకుడు ఒక పది మెట్లు కిందకు దిగి నిర్మాత కోసం సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా జరిగిన దాఖలాలు కూడా చాలా తక్కువ.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ఓ పెద్ద నిర్మాత. దాదాపు స్టార్ హీరోస్ అందరితో కూడా వర్క్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టారు. అలానే చాలామంది దర్శకులను పరిచయం కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వలన అవ్వచ్చు, లేకపోతే ఆ ఆ నిర్మాత మాట్లాడే తీరు వలన అవ్వచ్చు. ప్రస్తుతం ఆ బడ నిర్మాతకి ఇప్పుడు ఒకళ్ళు కూడా డేట్లు ఇవ్వడం లేదట. ప్రస్తుతం ఆ నిర్మాత చేసేదేమీ లేక వాళ్లతోను వీళ్ళతోనూ ఉన్న పరిచయాల వలన ఆయా దర్శకులను, హీరోలను తమ బ్యానర్ లో సినిమాలు చేయమని రాయబారాలు పంపుతున్నారట.
ఆ నిర్మాతకు ఒక్క సక్సెస్ఫుల్ సినిమా అనేది పడితే, ఆ సక్సెస్ మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. వరుస ఫెయిల్యూర్సు, భారీ డిజాస్టర్స్ వస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది నిర్మాతలు ఉన్నారు. గతంలో యాక్టివ్ గా సినిమా తీసిన నిర్మాతలు కూడా ప్రస్తుతం సినిమా తీయడానికి వెనకాడుతున్నారు. గతంలో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలను నిర్మించడం మానేశారు. ఇక బండ్ల గణేష్ అయితే మాత్రం మళ్లీ సినిమాలు తీస్తాను అని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు. కానీ ఇప్పటికీ అఫీషియల్ ఒక సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. త్వరలో చేసే అవకాశం అయితే మాత్రం ఉంది.
Also Read: Tollywood star heroes : చిన్న హీరోల పెద్ద హిట్లు, స్టార్ హీరోలు ఇకనైనా తగ్గండయ్యా