NTR: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. మంచి విజయాన్ని అందుకోవడంతో అందరి దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ పై పడింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాల్లో వార్ 2 ఒకటి. ఈమధ్యకాలంలో బాలీవుడ్ హీరోలు.. టాలీవుడ్ కి.. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ కి పరిచయమవుతున్న విషయం తెల్సిందే. వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు.
బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వార్ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో అందరికీ తెల్సిందే. ఇక ఈ హిట్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో టైగర్ ప్లేస్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక వార్ 2 సినిమా ట్రైలర్ ను జూలై 25 న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. హృతిక్ ను పక్కన పెడితే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ కే రచ్చ చేయడం మొదలుపెట్టేశారు. తాజాగా మెల్బోర్న్ లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్.. డ్యూటీ ఎక్కేశారు. వార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఆకాశంలో ఎన్టీఆర్ పేరును లిఖించేశారు. ఎన్టీఆర్ పై తమ అభిమానం ఆకాశం అంతా అని నిరూపించారు. ఫ్లైట్ స్మోక్ తో ఎన్టీఆర్ వార్ 2 పేర్లను రాసి ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఇక్కడితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగలేదు. ఒకరేమో ఆకాశంలో ఎన్టీఆర్ పేరును లిఖిస్తే.. ఇంకొకరేమో నేలపై ఎన్టీఆర్ పేరును పండించారు. ఒక వ్యక్తి తన పొలంలో నారుమడిని ఎన్టీఆర్ అక్షరాలలో నాటాడు. అవి పెరిగి ఎంతో అందంగా కనిపించాయి. అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. తామా అభిమానాన్ని ఇలా చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.అయితే సినిమా రిలీజ్ కు ముందు చేసినా ఒక అందం అనుకుంటే.. వీరు కేవలం ట్రైలర్ రిలీజ్ కే ఇంత హడావిడి చేశారు. అది ఎన్టీఆర్ రేంజ్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఆగస్టు 14 న వార్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే రోజున కూలీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోటాపోటీయుద్ధం మొదలైంది. దీంతో ఈసారి ఈ పోటీని చూడడానికి ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.మరి ఈ పోటీలో ఎన్టీఆర్- హృతిక్ గెలుస్తారా.. ? లేక రజినీకాంత్ – అమీర్ ఖాన్ గెలుస్తారా.. ? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
Crazyyy Stuff !!!
NTR fan promoted his upcoming movie War2 in the skies of Australia #War2 #yashraj #Ntr #HrithikRoshan pic.twitter.com/54VWZePYTx— Jmoney (@tweetbyjoey) July 24, 2025