Saiyaara OTT Release: ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ తో సెన్సేషన్ చేస్తోన్న చిత్రం ‘సయారా’. ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతోంది. ఆషికి, ఆషికి 2 మించిన ఎమోషన్ లవ్ స్టోరీ ఉండటంతో ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా చూస్తూ ఎంతో మంది ఆడియన్స్ థియేటర్లలోనే ఏడ్చేసిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇవి ప్రమోషన్స్ కి బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ప్రేమికులైతే మళ్లీ మళ్లీ సినిమా చూసేందుకు వెళుతున్నారు. దీంతో రోజురోజుకి ఈ మూవీకి కలెక్షన్స్ పెరిగాయి.
బాక్సాఫీసు వద్ద సయారా దూకుడు
ఫలితంగా బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ సాధించింది. తొలి వీకెండ్ లోనే దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఇంకా బాక్సాఫీసు కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. మూవీ విడుదలైన రెండు వారాలు అవుతున్న ఇంకా బజ్ అలాగే ఉంది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు ఇద్దరు కొత్తవాళ్లే. ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రస్తుతం దర్శక నిర్మాతల దృష్టి వారిపై పడింది. ఈ సినిమా హీరో అహన్ పాండే, హీరోయిన్ అనీత్ పడ్డాలు యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్ అంటేనే రొమాంటి, లవ్ స్టోరీలు.
కానీ, ఈ మధ్య ఇలాంటి సినిమాలు వచ్చి చాలాకాలం అవుతుంది. వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇలాంటి టైంలో ‘సయారా’తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. బాలీవుడ్ చాలా కాలం తర్వాత ఆషికి 2 లాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ రావడం.. ఇది బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మళ్లీ బాలీవుడ్ హిట్ బాట పడుతుందనే ఆశలు మొదలయ్యాయి. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆసక్తిని సంతరించుకుంది. ఈ సినిమాను సొంతం చేసుకునేందుకు ఓటీటీ పోటీ పడగా.. చివరకు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ మూవీని సొంతం చేసుకుంది.
మూడు నెలల తర్వాతే ఓటీటీకి..
ఒప్పందం ప్రకారం సయారాను ఎనిమిది వారాల తర్వాత ఓటీటీకి రావాలి. సాధారణం బాలీవుడ్ చిత్రాలు కూడా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీకి వస్తుంది. కానీ, సయారా కి వస్తున్న రెస్పాన్స్ చూసి మూవీ మరింత లేట్ గా డిజిటల్ ప్రీమియర్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా ఈ మూవీ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో డిజిటల్ ప్రీమియర్ కు రావాలి. కానీ, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి 90 రోజుల తర్వాతే ఓటీటీకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఓటీటీతో ఒప్పందం చేసుకుంటున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సెప్టెంబర్ రావాల్సిన సయారా.. అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉంది. మరి అన్నిరోజులు మూవీ కోసం వెయిట్ చేయాలా? ఓటీటీ ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: HHVM-Keeravani: ఆ ట్రోల్స్ కి చెక్.. పవన్ మాటలే నిజమయ్యాయి.. హరి హర వీరమల్లుకు ప్రాణం పోసిన కీరవాణి