Tanveer Ahmed Reaction On Shimron Hetmyer Run Out Controversy: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మొన్నటి వరకు వన్డే సిరీస్ జరగగా.. ఇప్పుడు టి20 సిరీస్ కూడా షురూ అయింది. అయితే, వేదికగా జరిగిన తొలి టీ20లో ఓ వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో డేంజర్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయర్ రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ పై షిమ్రోన్ హెట్‌మెయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా అంపైర్ తో గొడవ కూడా పెట్టుకున్నాడు.
ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో మ్యాచ్ లు ఎప్పుడు జరిగినా ఫిక్సింగ్ జరగడం గ్యారంటీ అని ఆరోపణలు చేశారు. అందుకే షిమ్రోన్ హెట్‌మెయర్
రనౌట్ కాకపోయినా అంపైర్లు ఔట్ ఇస్తారని బాంబు పేల్చారు. అంపైర్లు ఎప్పుడో బీసీసీఐకి అమ్ముడుపోయారని… అందుకే వెస్టిండీస్ కు అనుకూలంగా నిర్ణయం రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సిరీస్ కూడా టీమిండియా గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా షిమ్రోన్ హెట్‌మెయర్ రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో విండీస్ కెప్టెన్ షై హోప్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో షిమ్రోన్ హెట్‌మెయర్ బౌలర్ ఎండ్ వైపు ఉన్నాడు. సింగిల్ కోసం పరిగెత్తే సమయంలో కాస్త నిర్లక్ష్యం వహించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వేగంగా బంతిని వికెట్ కీపర్ సంజు శాంసన్ కు అందించాడు.
దీంతో ఆలస్యం చేయకుండా వికెట్లను సంజు శాంసన్ గిరాటేశాడు. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన షిమ్రోన్ హెట్‌మెయర్ క్రీజులో సరిగ్గా బ్యాట్ పెట్టలేదు. బ్యాట్ పైకి లేవడంతో రనౌట్ గా అంపైర్లు ప్రకటించారు. అయితే, దీనిపై షిమ్రోన్ హెట్‌మెయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక సంఘటనపై తన్వీర్ అహ్మద్ స్పందించి, ఫిక్సింగ్ జరిగినట్టు బిల్డప్ లు ఇచ్చాడు. టీమిండియాది తొండాటనేనని, అంపైర్లకు డబ్బులు చల్లరంటూ రెచ్చిపోయాడు. దీంతో తన్వీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్ పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని టీమిండియా నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్, 171 పరుగులు చేసింది.ఈ టార్గెట్ ను 14.4 ఓవర్లలో టీమిండియా, 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీతో ఇరగదీశాడు.
Shimron Hetmyer fumes after being involved in bizarre run-out during IND vs WI 2026 1st T20I pic.twitter.com/cpCOrPqMPp
— Cricket Hub (@Anurag9793) October 6, 2026