E-Paper
Advertisement

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!
Advertisement

AAFA: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పలు రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

ప్రతి సంవత్సరం ఒక మంచి పని లక్ష్యంగా..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మహారాష్ట్ర కమిటీని ముంబైలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఏర్పాటు చేశారు. ఇలా మహారాష్ట్రలో కూడా ఈ కమిటీ ప్రారంభించడంతో ఇకపై మహారాష్ట్రలో కూడా అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించబోతున్నారు. రాష్ట్ర కమిటీతో పాటు 10 జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మహారాష్ట్రలో AAFA కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా భాగం చేయబోతున్నారు. “ప్రతి సంవత్సరం ఒక మంచి పని” అనే లక్ష్యంతో AAFA సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

HPV వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు..

Advertisement

ఇప్పటికే హెచ్ పి వి వ్యాక్సిన్ గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. 14 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళలు అమ్మాయిలలో గర్భాశయ క్యాన్సర్లు రాకుండా HPV వ్యాక్సిన్ దోహదం చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ వ్యాక్సిన్ పై పలు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మహారాష్ట్రలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ విస్తరించడంతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా రోజురోజుకు అల్లు అర్జున్ క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోతుందని చెప్పాలి.

రాకా అప్డేట్ కోసం ఎదురుచూపులు..

అల్లు అర్జున్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా(Raaka) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని సమాచారం. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు సరైన అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇంతకుమించి ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సినిమా విడుదల విషయంలో కూడా ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

Advertisement

Also Read: ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

Related News

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

27 ఏళ్ల తర్వాత చిరుతో జతకట్టబోతున్న రమ్యకృష్ణ.. ఈ ట్విస్ట్ ఏంటి బాస్?

తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!

Big Stories

Advertisement
×