War 2 Duration : ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎదురు చూస్తున్న ఏకైక డేట్ ఆగస్టు 14. దీనికి కారణం రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల కానున్నాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి.
రజనీకాంత్ కూలీ సినిమాని ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ వార్ 2 సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమాల్లో నటించడం వలన నాగవంశీ ఒక అడుగు ముందుకు వేసి ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. గతంలో దేవర సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.
వార్ 2 డ్యూరేషన్
కొన్ని సినిమాలు ఆసక్తికరంగా అనిపిస్తే ఎంతసేపు ఉన్నా చూడాలి అనిపిస్తుంది. సినిమా ఆసక్తికరంగా లేకపోతే రెండు గంటలు ఉన్నా కూడా బోర్ కొడుతుంది. ఈరోజుల్లో ప్రేక్షకులకు ఓపిక తగ్గిపోయింది. ఒక సినిమా కోసం రెండు గంటల పైగా కూర్చోవడం అంటే అసాధారణమైన పని. అందుకే చాలామంది థియేటర్ కి రావడమే మానేశారు. అలానే కొన్ని పెద్ద సినిమాలకు డ్యూరేషన్ ఉన్నా కూడా ఆసక్తికరంగా ఉండటం వలన బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ప్రస్తుతం వార్ 2 సినిమా డ్యూరేషన్ ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తం రెండు గంటల 53 నిమిషాల 23 సెకండ్లు ఈ సినిమా ఉండబోతుంది. అంటే దాదాపు ఈ సినిమా మూడు గంటల పాటు ఉండనుంది. అంతసేపు ప్రేక్షకులకు ఓపిక ఉంటుందా? లేదంటే సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచారా అనేది చాలామంది సందేహం.
ఎన్టీఆర్ కోసమే నాగ వంశీ
వాస్తవానికి ఈ సినిమా మీద నాగ వంశీకి కూడా పెద్దగా హోప్స్ లేవు. కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా పెద్దగా బజ్ లేదు అనేది కొంతమంది అభిప్రాయం. అందరి చూపులు కూడా కూలీ సినిమా వైపు ఉన్నాయి. వాస్తవానికి మొదట ఈ సినిమానే నాగ వంశీ కొనే ప్లాన్ చేశాడు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఏదేమైనా సినిమా మౌత్ టాక్ తో హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక వార్ 2 సినిమా కూడా మంచి టాక్ సంపాదించుకుంటే అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడం కూడా ఖాయమని చెప్పాలి.
Also Read: NanI Paradise: ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో నాని పారడైజ్ ఫస్ట్ లుక్, ఈసారి ఏమి తగలబెడతాడో