BCCI : టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు నిన్న, మొన్నటి వరకు అన్ని ఫార్మాట్లలో రాణించారు. వీరిద్దరూ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. 2024 టీ-20 వరల్డ్ కప్ తరువాత వీరు టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కి కూడా వీరిద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. వీరితో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనకి ముందు వీళ్లు ఇలా రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా వీరికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
Also Read : Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!
వన్డేలకు రోహిత్, కోహ్లీ దూరం
ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టు కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. విరాట్ కోహ్లీ కూడా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కేవలం వన్డే మ్యాచ్ లకు మాత్రమే పరిమితమైన ఈ ఆటగాళ్లు వచ్చే వరల్డ్ కప్ కి ఆడేది డౌట్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్ ఇవ్వనుంది. 40 సంవత్సరాలు దాటిన ప్లేయర్లను పక్కకు పెట్టి యంగ్ స్టార్ లను 2027 వన్డే వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తోందట. 2027 వరల్డ్ కప్ సమయానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు ప్లేయర్లు 40 సంవత్సరాలు దాటుతారు. ఈ లెక్కన కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆడబోరన్నమాట. ఇక అదే జరిగితే అంతకంటే ముందే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. 2027 వన్డే ప్రపంచ కప్‌నకు ఇంకా 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంది. ప్రపంచ కప్‌నకు ముందు టీం ఇండియా ఎన్ని వన్డే మ్యాచ్‌లు ఆడుతుందనేది కూడా ఆసక్తికరమైన ప్రశ్న.
ప్రస్తుతం దానిపైనే దృష్టి
ఇందుకు సమాధానం 27 మాత్రమేనని తెలుస్తోంది. అవును, రెండేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచ కప్‌నకు ముందు, భారత జట్టు 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో మొత్తం 27 మ్యాచ్‌లు ఆడనుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న విషయం గురించి, ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు, వారు ప్రపంచ కప్‌లో ఆడటం గురించి బీసీసీఐ కూడా ఏమీ చెప్పలేదు. కానీ ది వీక్ నివేదిక ప్రకారం, బీసీసీఐ ఉన్నతాధికారులు త్వరలో వన్డేల్లో వారి భవిష్యత్తు గురించి విరాట్, రోహిత్‌లతో చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయం గురించి కోచ్ గౌతమ్ గంభీర్‌ను విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్‌లో ఆడటం గురించి అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. టీమిండియా దృష్టి ప్రస్తుతం 2026 టీ-20 వరల్డ్ కప్ పై ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరుగనుంది. ఆ తరువాత వన్డే వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తాం.. ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. అప్పటివరకు ఏమైనా జరుగవచ్చు అని సమాధానం చెప్పాడు.