BigTV English

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

War 2 : అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న సినిమా వార్ 2. ఇదివరకే వచ్చిన వార్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన వీడియోస్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.


ఎన్టీఆర్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను నమ్ముకొని ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకున్నాడు నిర్మాత నాగ వంశీ. మొదట్లో కూలీ సినిమా రైట్స్ కోసం ప్రయత్నించాడు కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఆల్టర్నేట్ గా ఈ సినిమా రిలీజ్ కావడంతో దీని పైన దృష్టి పెట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు నాగ వంశీ.

చంద్రబాబు,పవన్ కళ్యాణ్ కు థాంక్యూ


ఒకప్పుడు ఏదైనా సహాయం ఒకరి వలన జరిగితే సెలెబ్రెటీలు వాళ్లకి ఫోన్లు చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ వచ్చిన తర్వాత, ఆ పని ఇంకొంచెం ఈజీ అయిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ AP ప్రభుత్వం జీవో ఇవ్వడంపై హీరో జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈ జీవో ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తారక్ ట్వీట్ చేశారు.

గట్టి పోటీ నెలకొంది 

మరోవైపు వార్ సినిమాతో పాటు రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా విడుదల కాబోతుంది. వాస్తవానికి కూలి సినిమాకి విపరీతంగా టికెట్లు బుక్ అవుతున్నాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఆ సినిమా ఫలితం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోవడం ఖాయం. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి 1000 కోట్లు వసూలు చేసే సినిమా అయ్యే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఈ సినిమాకి అద్భుతమైన టాక్ వస్తే కానీ కూలీని డామినేట్ చేయదు అని చెప్పాలి. బుకింగ్స్ లో కూలీ సినిమాదే పైచెయ్యి.

వార్ 2 ఈవెంట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా చాలా గ్రాండ్ గా జరిపాడు నాగ వంశీ. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు. అలానే హృతిక్ రోషన్  స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. ఇక సినిమా ఫలితాన్ని బట్టి తర్వాత లెక్కల్లో చాలా మార్పు వస్తుంది. ఎన్నో పెద్ద సినిమాలు మధ్య వచ్చిన చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలను దాటి సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు అది కూడా జరిగే అవకాశం ఉందేమో వేచి చూడాలి.

Also Read: Coolie : ఇది రజనీకాంత్ అసలు క్రేజ్, టికెట్లు కొని మరి సినిమాకి పంపిస్తున్నారు

 

Related News

Coolie : ఇది రజనీకాంత్ అసలు క్రేజ్, టికెట్లు కొని మరి సినిమాకి పంపిస్తున్నారు

Varsha Bollamma :సీనియర్ నటుడిని కాలుతో తన్నిన హీరోయిన్, అంత గొడవ ఏమి జరిగింది?

Coolie: తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్, ఇదయ్యా మీ అసలు స్టామినా

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Big Stories

×