Coolie : ఒకప్పుడు తరచుగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి పెద్ద హీరో ఏడాదికి ఒకసారి రావడమే గగనం అయిపోయింది. తెలుగు హీరోలందరూ రెండు సంవత్సరాలకు ఒక సినిమా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో కేవలం ప్రభాస్ మాత్రమే త్వరగా ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక యంగ్ హీరోస్ లో నాని కూడా సంవత్సరానికి రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఒక పెద్ద హీరో సినిమా విడుదల అయితే మాత్రమే ఆడియన్స్ థియేటర్ కు వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ తరుణంలో రజనీకాంత్ కూలీ సినిమా విడుదలవుతుండడంతో విపరీతమైన సందడి నెలకొంది. గతంలో రజినీకాంత్ నుండి విడుదలైన సినిమాలకు ఎంత క్రేజ్ లేదు. కేవలం లోకేష్ కనగరాజ్ అనే బ్రాండ్ డైరెక్టర్ వలన కూడా ఈ క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. అంతేకాకుండా పలు ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించడం కూడా ఒక కారణం.
రజనీకాంత్ అసలు క్రేజ్
రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విపరీతమైన యాక్టింగ్ చేయకపోయినా కూడా, తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంది. తనకంటూ ఒక ఆటిట్యూడ్ ఉంది. తనకంటూ ఒక స్వాగ్ ఉంది. ఇవన్నీ కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన సినిమా ఆగస్టు 14న విడుదలవుతుండడంతో సింగపూర్ లో ఒక ప్రైవేట్ కంపెనీ సెలవును ప్రకటించింది.
సింగపూర్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న తమిళ వర్కర్స్ అందరికీ కూడా ఆగస్టు 14న సెలవు కేటాయించడం మాత్రమే కాకుండా టిక్కెట్లు ఇచ్చి కూలీ సినిమాకు పంపిస్తున్నారు. అలానే వాళ్ళ ఫుడ్ కు సరిపడా ఖర్చులు కూడా ఇస్తున్నారు.
కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు
ఇకపోతే ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడడంతో టిక్కెట్లు త్వరగా బుక్ అవుతున్నాయి. ఈ సినిమాకి ఉన్న బజ్ కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు. రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో 1000 కోట్లు సాధించిన సినిమా అంటూ రాలేదు. బహుశా కూలీ సినిమాకు అంతటి స్థాయి ఉంది అని చాలామంది అంచనా వేస్తున్నారు ఏమవుతుందో వేచి చూడాలి.
Also Read: Varsha Bollamma : సీనియర్ నటుడిని కాలుతో తన్నిన హీరోయిన్, అంత గొడవ ఏమి జరిగింది?