Sri Lanka Vs Bangladesh, Snake: క్రికెట్ మ్యాచ్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. క్రికెటర్ల మధ్య గొడవలు, బౌలర్ పైకి బ్యాటర్ తీసుకు వెళ్లడం లేదా బ్యాటర్ ను ఉద్దేశించి బౌలర్ బూతులు తిట్టడం.. వికెట్ల వెనుక కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్… బండ బూతులు తిట్టడం లాంటివి జరుగుతాయి. క్రికెట్ అంటే స్లెడ్జింగ్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనలు కూడా జరుగుతూ మ్యాచులు కొనసాగుతాయి. అయితే తాజాగా ఓ వన్డే మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో… భయంకరమైన విషపూరిత పాము మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్లేయర్ లందరూ బిజీగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో గ్రౌండ్ లోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Ishan Kishan – CSK : కావ్య పాప బిగ్ స్కెచ్.. SRH లోకి CSK సిక్సుల వీరుడు!
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో పాము కలకలం
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే తొలి వన్డే కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక గ్రాండ్ విక్టరీ కొట్టింది. సాధారణంగా శ్రీలంక దేశంలో వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. దానివల్ల.. చాలా రకాల పాములు బయట తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. ప్రేమదాస స్టేడియం లోకి భయంకరమైన పాము ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్లో ఉన్న ప్లేయర్లు అందరూ ఉలిక్కిపడ్డారు.
ఇక గ్రౌండ్ లోకి పాము ఎంట్రీ ఇవ్వడంతో ప్రేమదాస స్టేడియం అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. పాములు పట్టే వ్యక్తులను రంగంలోకి దింపి దాన్ని బయటకు పంపించారు. దీంతో ఆ పాము గ్రౌండ్ లోంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ తరుణంలో ప్లేయర్లు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నాగిని డాన్స్ చేసే బంగ్లాదేశ్ ప్లేయర్ల కోసం… నిజంగానే పాము వచ్చిందని సెటైర్లు పేల్చుతున్నారు. సాధారణంగా ఆ బంగ్లాదేశ్ ప్లేయర్లు ప్రతి మ్యాచ్ విజయం తర్వాత నాగిని తరహాలో డాన్స్ చేస్తారు. అందుకే క్రికెట్ అభిమానులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన శ్రీలంక
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైంది. అయితే ఈ మొదటి మ్యాచ్ లోనే శ్రీలంక జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ జట్టుపై ఏకంగా 77 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసింది శ్రీలంక. ఈ తరుణంలోనే 49.2 ఓవర్లలో… 244 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 167 పరుగులకు కుప్ప కూలింది.
Also Read: Jaiswal : స్టోక్స్ కుట్రలు… జైస్వాల్ ను బండ బూతులు తిడుతూ..!
#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ
— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025