E-Paper

ఆమెను తాకితే షాక్ కొడుతోంది.. తిరువీర్ ‘ఓ సుకుమారి’ టీజర్ ట్విస్ట్ చూశారా?

ఆమెను తాకితే షాక్ కొడుతోంది.. తిరువీర్ ‘ఓ సుకుమారి’ టీజర్ ట్విస్ట్ చూశారా?

O Sukumari Teaser: తిరువీర్.. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్.’మసూద’ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి సినిమా లతో నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు సరికొత్త రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పేరు ‘ఓ సుకుమారి!’ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫన్-ఫిల్డ్ టీజర్‌ను మూవీ టీమ్  విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

 వైరల్ అవుతున్న క్రేజీ కాన్సెప్ట్

సాధారణంగా పెళ్లిళ్లు, ప్రేమకథల్లో వచ్చే ట్విస్టులు మనకు తెలిసిందే. కానీ ‘ఓ సుకుమారి!’ సినిమాలో దర్శకుడు భరత్ దర్శన్ సరికొత్త ఫాంటసీ, కామెడీ ఎలిమెంట్‌ను జోడించారు. తాజాగా విడుదలైన టీజర్‌ను గమనిస్తే.. హీరో తిరువీర్ తనకు కాబోయే భార్య చాలా సుకుమారంగా, సున్నితంగా ఉండాలని తన కుటుంబ సభ్యులకు కండిషన్ పెడతాడు. “చూడగానే ఒళ్లు జలదరించాలి” అంటూ తనకు వచ్చే అమ్మాయి ఎలా ఉండాలో ఎక్స్‌ప్రెషన్స్‌తో వివరిస్తాడు.

Also read :బాలయ్య-కొరటాల శివ ‘#NBK112’ ముహూర్తం ఫిక్స్.. ఏపీ రాజధాని వేదికగా క్రేజీ లాంచ్!
అతని అంచనాలకు, కలలకూ తగ్గట్టే ఒక చక్కటి అమ్మాయిని (ఐశ్వర్య రాజేశ్) చూసి పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించేస్తారు. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకున్న సమయంలోనే అసలైన ట్విస్ట్ ఎదురవుతుంది. పెళ్లి పీటల మీద కూర్చున్న సమయంలో, అనుకోకుండా పెళ్లికూతురి భుజం హీరోకు తగులుతుంది. అంతే.. పెళ్లికొడుకుకు ఒక్కసారిగా తేలికపాటి ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. అసలు ఆ అమ్మాయిని తాకితే షాక్ ఎందుకు కొట్టింది? వీరి పెళ్లి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే క్రేజీ కాన్సెప్ట్‌తో టీజర్‌ను కట్ చేసి ఆడియన్స్‌లో మాంచి క్యూరియాసిటీని పెంచేశారు.

 తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబో అదరహో!

ఇప్పటివరకు సీరియస్, ఇంటెన్స్ పాత్రల్లో మెప్పించిన తిరువీర్.. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ రోల్‌లో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టైమింగ్ కామెడీతో ఆయన చేసిన హంగామా ప్రేక్షకులను నవ్విస్తోంది. మరోవైపు, గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఈ చిత్రంలో గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనుంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా  నిలవనుంది.

 టాప్ టెక్నీషియన్స్.. 

ఈ చిత్రంతో భరత్ దర్శన్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘శివం భజే’ చిత్రం మంచి విజయాన్ని సాధించగా, ఇప్పుడు వస్తున్న రెండో సినిమా కావడంతో ట్రేడ్ సర్కిల్స్ లోనూ  దీనిపై మంచి క్రేజ్ కనిపిస్తుంది.

Also read :షాకింగ్ ట్విస్ట్.. వారణాసి నుండి వైజాగ్‌కు మారిన మహేష్ బాబు సీన్స్..?
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. టీజర్‌లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.ఇక ‘రజాకార్’, ‘మంగళవారం’, ‘పొలిమేర’ వంటి విభిన్న చిత్రాలకు కెమెరా వర్క్ అందించిన సీహెచ్ కుషేందర్ ఈ సినిమాకు విజువల్స్ అందిస్తున్నారు.జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ 

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘ఓ సుకుమారి!’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. సౌత్ ఇండియా మొత్తం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి టీజర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సుకుమారి.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో !

Related News

బాలయ్య-కొరటాల శివ ‘#NBK112’ ముహూర్తం ఫిక్స్.. ఏపీ రాజధాని వేదికగా క్రేజీ లాంచ్!

రిటైర్డ్ IPS భార్య హత్య కేసుపై RGV కన్ను: ‘నేపాలీ గ్యాంగ్స్’ కథతో నెక్స్ట్ సినిమా?

షాకింగ్ ట్విస్ట్.. వారణాసి నుండి వైజాగ్‌కు మారిన మహేష్ బాబు సీన్స్..?

పవన్ కళ్యాణ్ ‘ఓజి 2’పై మైండ్ బ్లోయింగ్ లీక్.. షూటింగ్ డేట్ ఫిక్స్!

కాంచన 4… నయనతార, పూజా హెగ్డేలతో లారెన్స్ భారీ ప్లాన్!

హీరోయిన్ మీనాక్షి చౌదరికి షాక్.. రంగంలోకి దిగిన సైబర్ కేటుగాళ్లు!

భర్తతో విడిపోయిన తర్వాత దారుణమైన ట్రోల్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

×