E-Paper
Advertisement

కుళ్ళిపోయిన మృతదేహం… కొత్త ఎస్ఐ అడుగు పెట్టిన ఊళ్ళో అల్లకల్లోలం

కుళ్ళిపోయిన మృతదేహం… కొత్త ఎస్ఐ అడుగు పెట్టిన ఊళ్ళో అల్లకల్లోలం
Advertisement

Thriller Movie : చాలా కాలం నుంచి మలయాళం సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఒక లేటెస్ట్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లరే “Dridam”. జూన్ 5న అమెజాన్ జియో హాట్ స్టార్ (JioHotstar) లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. కొత్త పోస్టింగ్ వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ కు ఎలాంటి సమస్యలు వచ్చాయి ? అసలు ఎక్స్పీరియన్స్ లేని ఆ ఎస్ఐ అస్సలు క్రైమ్ లేని ఊర్లో పోస్టింగ్ వస్తే, ఆ తరువాత వరుసగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసిన కేసులను ఎలా హ్యాండిల్ చేశాడు ? అన్నది మూవీ స్టోరీ లైన్.

కథలోకి వెళ్తే…

చిన్నప్పటి నుంచి పోలీస్ అధికారి కావాలని కలలు కంటాడు మన హీరో విజయ్ రాధాకృష్ణన్ (షేన్ నిగం). ఈ హ్యాండ్ సమ్ పోలీస్ తన మొదటి పోస్టింగ్‌ గా ఒక ప్రశాంతమైన హిల్ స్టేషన్‌ కు వెళతాడు. ఆ ప్రాంతం ఎప్పుడూ శాంతియుతంగా, చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా కేసులు లేని ప్రదేశం. విజయ్‌కు ఇది ఒక రిలాక్స్ పోస్టింగ్‌ లా అనిపిస్తుంది. కానీ అతను బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా విచిత్రంగా మారిపోతుంది. ఆ ఊర్లో ఒక భయంకరమైన హత్య జరుగుతుంది. ఒక కుక్క శవం చేతిని పట్టుకుని ఊర్లోకి రావడంతో మొదలవుతాయి సమస్యలు.

Advertisement

హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే, ఆ తర్వాత మరో దొంగతనం, మరో హత్య… ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఊరంతా భయంతో కంపిస్తుంది. ప్రజలు, మీడియా, ఉన్నతాధికారులు… అందరూ విజయ్ మీద ఒత్తిడి పెంచుతారు. “పోలీస్ అడుగు పెట్టిన వేళా విశేషం అలా ఉంటుంది మరి. పై అధికరులు ఒక్క వారంలోపు కేసు పరిష్కరించాలి అని డెడ్‌లైన్ విధిస్తారు. విజయ్ తన మొదటి పోస్టింగ్‌ లోనే ఇంత పెద్ద ఛాలెంజ్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను దర్యాప్తు చేస్తుండగా ఊరి గతం గురించి రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడతాయి. ఇంకేముంది ఆ కేసులకు పాత పగలు, స్థానిక రాజకీయాలు వంటివన్నీ ముడిపడి ఉంటాయి.

ఎందుకు చూడాలి ?

హీరో షేన్ నిగం రోకీ కాప్ పాత్రలో చాలా నేచురల్‌ గా నటించాడు మొదట్లో పాత్రల ఇంట్రడక్షన్ తో కాస్త ల్యాగ్ అనిపించినా, నెమ్మదిగా కథ ఊపందుకుంటుంది. కొడగు స్టైల్ హిల్ స్టేషన్ లొకేషన్లు చూడడానికి బాగుంటాయి. సస్పెన్స్, ట్విస్టులు, ఎమోషన్ వంటివి కావలసినన్ని ఉన్నాయి. దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. ఇక IMDbలో దీనికి 9.2 రేటింగ్ ఉండడం మరో విశేషం. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు డోంట్ మిస్.

Advertisement

Read Also :  మెంటల్ హాస్పిటల్ నుంచి తిరిగొచ్చే అక్కా చెల్లెల్లు… మెంటలెక్కించే కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×