NBK112 Launch Buzz: టాలీవుడ్ బాక్సాఫీస్ ని దబిడి దిబిడే అంటూ దంచికొట్టే బాలయ్య మరో భారీ కాంబినేషన్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. తారక్ తో ‘దేవర’ వంటి సాలిడ్ సక్సెస్ తర్వాత, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన నెక్స్ట్ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌ను బాలయ్యతో పట్టాలెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘#NBK112’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ వేదిక, సమయం దాదాపు సెట్ అయిపోయాయి .అవును.. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జూన్ 25, గురువారం నాడు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయిపోతుంది.
సాధారణంగా సినిమాల ముహూర్తాలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధిలో లేదా ప్రైవేట్ స్టూడియోల్లో జరుగుతుంటాయి. కానీ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన టీటీడీ (TTD) శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈ చిత్ర ప్రారంభోత్సవానికి వేదికగా ఎంచుకున్నారు. ఏపీ రాజధాని నడిబొడ్డున, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.
Also read :షాకింగ్ ట్విస్ట్.. వారణాసి నుండి వైజాగ్‌కు మారిన మహేష్ బాబు సీన్స్..?
ఈ సినిమా ముహూర్తపు వేడుక కేవలం సినిమా ఈవెంట్‌లా కాకుండా, ఒక భారీ పండగలా సాగనుందని సమాచారం. నందమూరి, నారా కుటుంబాల నుంచి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ లు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రానున్నారు.దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ రానుందని సమాచారం.
ఇక బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీకి.. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని చెప్పవచ్చు. సమాజంలో జరిగే కొన్ని సున్నితమైన అంశాలను కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పడంలో కొరటాల పెట్టింది పేరు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లేదా హై-వోల్టేజ్ సోషల్ డ్రామాను ఆయన సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తోంది.
Also read :రిటైర్డ్ IPS భార్య హత్య కేసుపై RGV కన్ను: ‘నేపాలీ గ్యాంగ్స్’ కథతో నెక్స్ట్ సినిమా?
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. ముఖ్యంగా కొరటాల శివ సినిమాల్లో ఉండే మ్యూజిక్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే బాలయ్య సరసన నటించే హీరోయిన్, ఇతర లీడ్ యాక్టర్స్ ని జూన్ 25న జరిగే పూజా కార్యక్రమాల రోజే అఫీషియల్ గా రివీల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఏది ఏమైనా ఆరు పదులు దాటినా ఇంకా దూకుడుగా వరుస సినిమాలని లైనప్ చేస్తున్న బాలయ్యని చూసి యంగ్ హీరోలు స్పీడ్ పెంచాల్సిందే అని చెప్పకతప్పదు.