Obsession OTT: ఒక్క సినిమా ..ఒకే ఒక్క సినిమా ఇండియన్ సినిమాకి చాలెంజ్ విసిరింది.బడా బడా డైరెక్టర్స్ మీ అని చెప్పుకున్న వాళ్ళ మతులు పోగొట్టింది.భారీ బడ్జెట్లు,మిరుమిట్లు గొలిపే సెట్లు,కనువిందు చేసే అందచందాలు ..ఇవి కాదు సరైన కంటెంట్ డెలివర్ చేస్తే కాసులు ఎలా కొల్లగొట్టవచ్చో ప్రూవ్ చేశాడు కర్రీ బార్కర్ అనే ఈ హాలీవుడ్ కుర్ర డైరెక్టర్.ఆ సినిమా పేరే ‘అబ్సెషన్’.అవును..పేరు మోసిన ఎన్నో సినిమాలు యాబయ్ కోట్లు వసూలు చేయడానికే ఆపసోపాలు పడుతుంటే కేవలం 7 కోట్లతో తీసిన ఈ సినిమా ఇండియాలో ఏకంగా 77 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకి పెద్ద షాకే ఇచ్చింది.
అలాంటి ఈ సినిమా ఇపుడు ఇండియాలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపొయింది.ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన యాపిల్ టీవీలో రేపటి నుండి అంటే జూన్ 30 నుండి ఈ సినిమా డిజిటల్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది.మొత్తానికి థియేటర్ లో మిస్ అయిన వారిని ఇలా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరోసారి ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయిందన్న మాట.అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొదటగా ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా త్వరలో రీజినల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది.
also read:రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు స్టంట్స్..నెటిజన్లు ఫైర్!
ఇక సినిమా కథ విషయానికి వస్తే ..ఒక సాధారణ మ్యూజిక్ స్టోర్ ఉద్యోగం చేసుకునే బారోన్ అలియాస్ బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) వట్టి అమాయకుడు.కానీ నిక్కీ ఫ్రీమెన్ (ఇండీ నవరెట్టే) ను ఘాడంగా ప్రేమిస్తాడు.అయితే ఆ అమ్మాయి ఎక్కడ తన ప్రేమని రిజెక్ట్ చేసి ఉన్న స్నేహాన్ని కూడా తెంచుకుంటుందో అని తెగ బాధ పడిపోతుంటాడు. అలాంటి సమయంలోనే బేర్ కి ఒక పురాతన షాప్ లో కోరిన కోరికలు నెరవేర్చే ఒక మాయా స్టిక్ దొరుకుతుంది.దాని స్పెషాలిటీ ఏంటంటే దాన్ని గనుక విరగొట్టి మనసులో ఏదైనా కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుంది.దీంతో వెంటనే బేర్ దాన్ని విరగొట్టి నిక్కీ తన సొంతం కావాలని కోరుకుంటాడు.
also read:Kalki 2898 AD.. రెండేళ్లయినా తగ్గని ‘కల్కి’ రేంజ్.. సరికొత్త పోస్టర్‌తో షేక్ చేస్తున్న ప్రభాస్
దాంతో బేర్ అనుకున్నట్టే నిక్కీ అతని ప్రేమలో పడుతుంది.కానీ రాను రాను ఆ ప్రేమ ఒక పిచ్చిగా మారిపోతుంది.అది ఎంతలా అంటే బేర్ ఆమే చూపే ప్రేమని తట్టుకోలేనంత. అలా అతిగా ప్రేమిస్తూ ప్రేమిస్తూ చివరికి బేర్ కోసం నిక్కీ ఏం చేయడానికైనా తెగిస్తుంది.అలా ప్రాణాలు తీసే సైకో లా మారిన నిక్కీ చివరికి ఏం చేసింది.బేర్ ఆ పిచ్చి ప్రేమ నుండి ఎలా బయటపడ్డాడు అన్నదే సినిమా.ప్రేమ ఎక్కువైతే అది ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ కర్రీ బార్కర్.ఈ సినిమాలో మైకేల్ జాన్‌స్టన్ బయపడిపోయే లవర్ గా యాక్టింగ్ అదరగొడితే, సైకో లవర్ గా ఆడియన్స్ కి ముచ్చెమటలు పట్టించింది ఇండీ నవరెట్టే.
ఒకరకంగా హాలీవుడ్‌లో ఆమధ్య వచ్చిన ప్రసిద్ధ సైకో-థ్రిల్లర్ సిరీస్ ‘యూ’ (YOU) లేదా ‘గన్ గర్ల్’ మూవీస్ ని లవ్ చేసేవారికి ఈ సినిమా పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.చూడాలి మరి వరల్డ్ వైడ్ గా 370 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి ‘మిజరీ’, ‘ఫాటల్ అట్రాక్షన్’ వంటి క్లాసిక్ సైకలాజికల్ థ్రిల్లర్ల సరసన నిలిచిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎలాంటి రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుందో !