E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Kalki 2898 AD.. రెండేళ్లయినా తగ్గని ‘కల్కి’ రేంజ్.. సరికొత్త పోస్టర్‌తో షేక్ చేస్తున్న ప్రభాస్

Kalki 2898 AD.. రెండేళ్లయినా తగ్గని ‘కల్కి’ రేంజ్.. సరికొత్త పోస్టర్‌తో షేక్ చేస్తున్న ప్రభాస్
Advertisement

Kalki Anniversary: వైజయంతి మూవీస్ సమర్పణలో దర్శకుడు నాగ్ అశ్విన్ వెండితెరపై సృష్టించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ థియేటర్లలోకి వచ్చి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

తాజాగా ఈ సినిమా రెండు సంవత్సరాల మైల్‌స్టోన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో వదిలిన ఒక స్పెషల్ క్రేజీ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. “2 Years Of Kalki” అంటూ నెటిజన్లు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాతో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ హ్యండిల్స్ మరోసారి మార్మోగిపోతున్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఈ చిత్రం సాధించిన ఘనతలు ఇప్పటికీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉన్నాయి.

అంచనాలని పెంచేస్తున్న కల్కి 2 

Advertisement

భారతీయ సినీ చరిత్రను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని ఎలాగైతే విభజించారో, ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ జానర్‌ను కల్కికి ముందు, కల్కికి తర్వాత అని చెప్పుకునేలా ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. కలియుగాంతం నేపథ్యంలో మహాభారత కాలానికి, భవిష్యత్తులోని కాశీ నగరానికి ముడిపెడుతూ నాగ్ అశ్విన్ రాసుకున్న స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. హీరో ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో భైరవ పాత్రకు ప్రాణం పోయగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా చూపించిన విశ్వరూపం థియేటర్లలో పూనకాలు తెప్పించింది. దీపికా పదుకొణె సుమతి పాత్రలో కథను నడిపించిన తీరు, క్లైమాక్స్‌లో కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’గా ఇచ్చిన ఎంట్రీ రాబోయే పార్ట్-2 పై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి. దిశా పటాని గ్లామర్, అశ్వత్థామ-భైరవ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి.

విదేశీ ఆడియన్స్ సైతం ఫిదా

కల్కి కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఇండియా పవర్ ఏంటో నిరూపించిన ఒక సంచలనం. విడుదలైన మొదటి రోజే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, లాంగ్ రన్‌లో ఏకంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను లిఖించింది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప వంటి భారీ ప్యాన్ ఇండియా చిత్రాల సరసన కల్కి కూడా చేరి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. నార్త్ బెల్ట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీకి ట్రేడ్ విశ్లేషకులే షాక్ అయ్యారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో విదేశీ ఆడియన్స్ సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు.

కల్కి బ్రాండ్‌కు మాత్రమే సాధ్యం 

Advertisement

ప్రస్తుతం రెండు సంవత్సరాల వేడుకల్లో మునిగితేలుతున్న అభిమానులంతా కల్కి పార్ట్-2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ముగింపులో నాగ్ అశ్విన్ వదిలిన ట్విస్ట్‌లు, కర్ణుడిగా ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేషన్, అమితాబ్-కమల్ హాసన్ మధ్య జరగబోయే మైండ్ బ్లోయింగ్ ఫేస్ ఆఫ్ సీన్స్ కోసం ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మరియు కొన్ని కీలకమైన యాక్షన్ పార్ట్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఏదేమైనా, విడుదలైన రెండేళ్ల తర్వాత కూడా ఒకే ఒక్క పోస్టర్‌తో సోషల్ మీడియాలని  రూల్ చేయడం కల్కి బ్రాండ్‌కు మాత్రమే సాధ్యమైందనడంలో ఆశ్చర్యం లేదు !

Related News

కన్నప్ప మూవీకి ఏడాది.. మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్!

ట్రాజెడీ ట్రెండ్.. చావుల చుట్టూ తిరిగే ప్రేమకథలను నేటి యూత్ యాక్సెప్ట్ చేస్తుందా?

రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు స్టంట్స్..నెటిజన్లు ఫైర్!

ఒకే ఫ్రేమ్‌లో ప్రభాస్-అనుష్క.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో క్రేజీ మూమెంట్స్!

కళ్లముందే తిరిగిన మిత్రుడు ఇక లేడు…భాగ్యరాజ మృతిపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

‘అఖండ 2’ నష్టాల ఎఫెక్ట్… రూట్ మార్చి పాన్ ఇండియా కథతో వస్తున్న మాస్ డైరెక్టర్!

Kollywood : తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Big Stories

×