OG Shooting : ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకప్పుడు ప్రేక్షకులను అలరించారు. కానీ రాజకీయాల్లోకి రావాలన్న ఆయన కోరిక బలంగా మారి దాదాపు పది సంవత్సరాల కష్టం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించేలా చేసింది. అలా ప్రస్తుతం ఏపీకి డీసీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. మరొకవైపు అభిమానులను అలరించడానికి తాను ప్రకటించిన మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ జ్యోతికృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ. ఎమ్. రత్నం (AM Ratnam) ఈ సినిమాను నిర్మించారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
OG పై భారీ అంచనాలు..
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ లిస్ట్ లో ఉన్న రెండవ చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) . ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (director Sujith ) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వం అంటేనే సినిమా దాదాపు 70 శాతం హిట్ అయినట్టే.. హీరో పైన మిగతా 30% ఆధారపడి ఉంటుంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మంచి హైప్ క్రియేట్ చేస్తూ ఏకంగా పవన్ కళ్యాణ్ తో మొదలైన ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ , ఇమ్రాన్ హస్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సెప్టెంబర్ లోనే రిలీజ్..
ఇదిలా ఉండగా ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ తేదీన వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు రాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక విషయం రూమర్స్ అన్నిటికి పెట్టింది అని చెప్పవచ్చు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఓజీ సినిమా షూటింగ్లో భాగంగా హీరో షూటింగ్ కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. విడుదలకు ఇంకా 30 రోజులు మిగిలి ఉంది కాబట్టి సినిమా పూర్తి కావడానికి తగినంత సమయం కంటే ఎక్కువ సమయమే మిగిలిందని చెప్పవచ్చు. ఇకపోతే సినిమా షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు దాదాపుగా 99% పూర్తయినట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా సెప్టెంబర్ లోనే విడుదల కాబోతోందని స్పష్టమవుతుంది. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజే ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అటు మేకర్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read:Malavika Mohanan: అరుదైన అవార్డు అందుకున్న మాళవిక మోహనన్!