E-Paper
Advertisement

Mana Shankar Vara Prasad Garu: ఒక్క రోజు తేడా.. మెగాస్టార్ సినిమాకు భారీ నష్టం..ఏకంగా 100 కోట్లు మిస్!

Mana Shankar Vara Prasad Garu: ఒక్క రోజు తేడా.. మెగాస్టార్ సినిమాకు భారీ నష్టం..ఏకంగా 100 కోట్లు మిస్!
Advertisement

Mana Shankar Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా పండుగ సినిమా మన శంకర వర ప్రసాద్ గారు.. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. సోమవారం విడుదలైనప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే మంచి బజ్ ఉండటంతో పాటు.. ప్రీమియర్ షోల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు భారీ ఓపెనింగ్ తీసుకొచ్చింది.

నిర్మాతల ప్రకారం ఈ చిత్రానికి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 84 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇది వర్కింగ్ డే అయిన సోమవారం రోజున రావడం విశేషం. సాధారణంగా సోమవారాలు సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రావు. కానీ ఈ సినిమా ఆ రూల్‌ను బ్రేక్ చేసింది. అయితే..మేకర్స్ ఒక కీలక అవకాశాన్ని మిస్ చేసుకున్నారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Advertisement

ఈ సినిమా ఆదివారం విడుదలై ఉంటే తొలి రోజే 100 కోట్ల క్లబ్‌లోకి..వెళ్లేదని ట్రేడ్ పండితుల అంచనా. వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటే కలెక్షన్లు మరింత పెరిగేవని వారు చెబుతున్నారు. సోమవారం వర్కింగ్ డే కావడం వల్ల కొన్ని చోట్ల థియేటర్లకు ప్రేక్షకులు తక్కువగా వచ్చారు.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సోమవారం విడుదల ప్రభావం కొంత కనిపించింది. అయినప్పటికీ.. చిరంజీవి తన ప్రీమియర్ డే రికార్డులను తానే బద్దలు కొట్టారు. ఈ సినిమా ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించింది. ఒకవేళ శనివారం ప్రీమియర్స్ వేసి ఉంటే దాదాపు 2.5 మిలియన్ డాలర్ల వరకు వసూలు అయ్యేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

కథలో కొన్ని లోపాలు ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. చిరంజీవి కామెడీ టైమింగ్, ఆయన డాన్స్‌లలో కనిపించే గ్రేస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇవే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. దర్శకుడు అనిల్ రావిపూడి.. తన స్టైల్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారని అభిమానులు అంటున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటించారు. సహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. పండుగ సెలవులు మొదలవుతున్న నేపథ్యంలో..రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరింత దుమ్ము రేపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ: Star Heroines: ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్.. హీరోయిన్లదే హవా..!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×