E-Paper
Advertisement

Car Wash: మీ కారును అస్సలు వాష్ చేయడం లేదా? అయితే, మీకు ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే!

Car Wash: మీ కారును అస్సలు వాష్ చేయడం లేదా? అయితే, మీకు ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే!
Advertisement

చాలా మంది తమ కార్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటారు. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత క్లాత్ తో చక్కగా తుడవడం లేదంటే, బకెట్ లో సబ్బు నీళ్లు పట్టుకుని కడగడం చేస్తారు. కానీ, కొంత మంది కారును శుభ్రంగా కడుక్కోవాలనే ఆలోచన కూడా చేయరు. అయితే, కారు శుభ్రంగా ఉంచుకోకపోతే ఏమవుతుంది? జరిగే పరిణామాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ పెయింట్ నష్టం

కారు ప్రయాణం చేసే సమయంలో రోడ్డు మీద శిథిలాలు కారు మీద పడుతాయి. దుమ్ము దూళిలోని మూలకాలతో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇవన్నీ నెమ్మదిగా కారు అందంపై, దాని పని తీరుపై ఎఫెక్ట్ చూపిస్తాయి. కారును కడగడంలో నిర్లక్ష్యం చేయడం వలన కొన్నిసార్లు పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  వాటిలో ఒకటి పెయింటింగ్ నష్టం. దుమ్ములోని ప్రమాదకారకాలు పెయింటింగ్ ను డ్యామేజ్ చేస్తాయి. పక్షి రెట్టలు, బగ్ స్ప్లాటర్, రోడ్ సాల్ట్, చెట్టు రసాలు పెయింటింగ్ మీద ఎక్కువ ప్రభావాన్నిచూపిస్తాయి. పెయింట్‌ను కోల్పోయేందుకు కారణం అవుతాయి.

⦿ తుప్పు

Advertisement

పెయింట్ దెబ్బతిన్న తర్వాత, నెక్ట్స్ లేయర్ ఆక్సిజన్‌ తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా తుప్పు ఏర్పడుతుంది.   సాల్ట్ లాంటి పదార్థాలు మరింత వేగంగా కారు తుప్పు పట్టేందుకు కారణం అవుతాయి. అండర్ క్యారేజ్, వీల్స్, డోర్స్ సిల్స్, ట్రంక్  దిగువ భాగం, సాధారణంగా తుప్పుపడుతుంటాయి. ఈ మచ్చలు చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటాయి. అంతేకాకుండా, తుప్పు కారు పని తీరు మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది.

⦿ లో విజుబులిటీ  

కారు మీద పేరుకుపోయే మురికి విజుబులిటీ సమస్యకు కారణం అవుతుంది. ముఖ్యంగా కారు గ్లాస్ మీద పడిన దుమ్ము రోడ్డు మీద వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపించకుండా అడ్డుకుంటుంది.  డ్రైవింగ్ చేసేటప్పుడు బయటకు చూడటం కష్టంగా ఉంటుంది. భద్రతను ప్రమాదంలో పడేస్తుంది.  దుమ్మతో కూడిన కిటికీలు, అద్దాలు దృశ్యమానతను దెబ్బతీస్తాయి.  హెడ్‌లైట్‌లపై దుమ్ము పడి లైటింగ్ కూడా సరిగా కనిపించదు. ఇంకా చెప్పాలంటే విజుబులిటీని 80 శాతం వరకు తగ్గిస్తుంది. మురికితో కూడిన విండ్‌ షీల్డ్ వైపర్‌ కారణంగా గీతలు పడేందుకు కారణం అవుతుంది.

⦿ కారు లోపల సమస్యలు

Advertisement

మీ కారు బయటి భాగాన్ని కడగకపోవడం వల్ల లోపలి ప్రాంతం కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు కారు డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి ధూళి, కాలుష్య కారకాలు కారు లోపలికి వస్తాయి. లోపల జిగట మచ్చలు పడేందుకు కారణం అవుతాయి. సీల్స్ క్షీణించడానికి, గాలి నాణ్యత తగ్గడం, బూజు లాంటి సమస్యలకు కారణమవుతుంది. ఫలితంగా శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి.

⦿ తక్కువ రీసేల్ వ్యాల్యూ  

కారును కడగకపోవడం వల్ల కలిగే మరో మేజర్ నష్టం ఏంటంటే.. కారు రీసేల్ వ్యాల్యూ తగ్గుతుంది. కారు పాతగా కనిపిస్తుంది. అలాంటి కార్లను కొనుగోలు దారులు ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే రీ పెయింట్, తుప్పు ట్రీట్మెంట్,  హెడ్‌లైట్ మార్చడం లాంటివి చాలా ఖరీదైన వ్యవహారాలు. అందుకే రీసేల్ వ్యాల్యూ చాలా తక్కువగా ఉంటుంది.

Read Also:  గంటకు 500 కిలో మీటర్లు.. రికార్డులు బద్దలు కొట్టిన ఎలక్ట్రిక్ కారు!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×