E-Paper
Advertisement

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!
Advertisement

Dhee 10 Winner Raju Arrest:ఢీ 10′ డ్యాన్స్ షో విన్నర్ గా నిలిచి బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజు ఒక వివాదంలో చిక్కుకోవడం ఇపుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది.తన అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రాజుకి సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని అనుకుంటున్న ఈ సమయంలో ఊహించని విధంగా ఒక అమ్మాయి ఇచ్చిన పోలీసు ఫిర్యాదుతో అతను జైలుపాలయ్యాడు.

కొద్దిరోజుల్లోనే స్నేహం

Advertisement

విషయం లోకి వెళ్తే హైదరాబాద్ మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్‌లో బొటీక్ నడిపే ఒక అమ్మాయికి ,. అదే భవనంలో ఉండే చిట్టి డాన్స్ స్టూడియోకు ప్రాక్టీస్ చేయడానికి వచ్చే రాజు కి పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కొద్దిరోజుల్లోనే స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని రాజు నమ్మించడంతో వారిద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది.

ఏకంగా దాదాపు 12 లక్షల రూపాయలు

Advertisement

ఇక తనతో క్లోజ్ గా ఉన్నాడన్న నమ్మకంతోనే రాజు తనకు డబ్బులు అవసరమని అడిగిన ప్రతీసారి ఇస్తూ వచ్చింది.అలా ఏకంగా దాదాపు 12 లక్షల రూపాయల వరకు రాజుకు ఇచ్చానని తెలిపింది ఆ అమ్మాయి.
అయితే ఏళ్లు గడుస్తున్నా రాజు పెళ్లి గురించి ఏమీ మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చిన ఆ అమ్మాయి అతడిని అడగగా తన చెల్లెలి పెళ్లి అవ్వగానే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని పోలీసులకి చెప్పినట్టు తెలుస్తుంది.

ఇతర అమ్మాయిలతో తిరుగుతున్నాడని

ఇక  ఆ తర్వాత కూడా అతడు అలాగే సాగదీస్తూ , ఇతర అమ్మాయిలతో తిరుగుతున్నాడని తెలుసుకున్న ఆ అమ్మాయి తనను ప్రేమ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశాడని, ఆధారాలతో సహా మియాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిందని సమాచారం.

ఇక ఆ మ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ నెల 9వ తేదీన రాజుపై బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 69 మరియు 318(4) కింద కేసు నమోదు చేశారు. అలా అతడిని అదుపులోకి తీసుకుని విచారించాక, కోర్టులో హాజరుపరిచారు.ఇక కోర్టు రాజుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అతడిని జైలుకు తరలించారు.

ఎలాంటి నిజానిజాలు బయటికి వస్తాయో !

తెలుగు బుల్లితెరపై ‘ఢీ’ షోకి ఎంత పేరుందో చెప్పక్కర్లేదు . ఈ షో ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు వెలుగులోకి వచ్చి వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకున్నారు కూడా . అలాంటి పాపులర్ షో విన్నర్ ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో ఇరుక్కోవడంపై అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు డ్యాన్స్‌తో మెప్పించిన వ్యక్తి పరిస్థితి ఇలా అయిపోవడం ఏంటని బాధపడుతున్నారు.

చూడాలి మరి ముందు ముందు ఈ కేసులో ఎలాంటి నిజానిజాలు బయటికి వస్తాయో !

Tags

Related News

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

Big Stories

Advertisement
×