Prabhash: సాధారణంగా సెలబ్రిటీ వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు అంటే కచ్చితంగా మిగతా సెలబ్రిటీల సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. సినిమాపై అంచనాలు పెంచడానికి, మిగతా హీరోల అభిమానులు సినిమాను చూడడానికి ఈ సపోర్టు ఎప్పుడూ పనికి వస్తుంది. అందుకే ఒక సెలబ్రిటీ కిడ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు అంటే పలువురు బడా హీరోలు, హీరోయిన్లు ఆ సినిమాకి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న ఘట్టమనేని ఫ్యామిలీ (Ghattamaneni family) నుండి దివంగత నటుడు రమేష్ బాబు(Ramesh Babu) కొడుకు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పటికే తన అన్న కొడుకు జయకృష్ణ (Jaya Krishna) ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే మహేష్ బాబు తన అన్న కొడుకుకి అండగా నిలుస్తూ ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జయకృష్ణను అందరూ ఆదరించాలి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు.
అయితే ఇప్పుడు మహేష్ బాబు రిక్వెస్ట్ మేరకు పలువురు సెలబ్రిటీలు జయకృష్ణ ,రషా తడానీ జంటకు అండగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా వీరి కొత్త సినిమాకి సపోర్టు పలుకుతున్నారు. అందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా జయ కృష్ణకు స్పెషల్ విషెస్ చెబుతూ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మేరకు ప్రభాస్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా.. “తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్న రషా తడానీ (Rasha Thadani)కి అభినందనలు. అలాగే శుభాకాంక్షలు. జయ కృష్ణకు సినిమా రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీనివాస మంగాపురం చిత్రంతో ఘనవిజయం అందుకోవాలని.. చిత్ర దర్శకుడు అజయ్ భూపతి , అశ్వినీ దత్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ విషెస్ చెప్పడంతో బాబాయి రిక్వెస్ట్ మేరకు ఏకంగా ప్రభాస్ రంగంలోకి దిగారు.. ఘట్టమనేని వారసుడికి సపోర్ట్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మునుముందు ఎవరెవరు ఈ సినిమాకు మద్దతుగా పోస్ట్ పెడతారో చూడాలి అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.
శ్రీనివాస మంగాపురం సినిమా విషయానికొస్తే.. దివంగత నటులు.. సూపర్ స్టార్ కృష్ణ (Krishna ) మనవడిగా, దివంగత నటులు రమేష్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు జయకృష్ణ . శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారానే రవీనా టాండన్ కూతురు రషా తడానీ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.