E-Paper
Advertisement

జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?

జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?
Advertisement

Kochi Police Commissioner: అదనపు జిల్లా జడ్జి మైనర్ కుమారుడు ప్రమేయమున్న రోడ్డు ప్రమాదం కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోచి పోలీస్ కమిషనర్ కాళిరాజ్ మహేష్‌పై ప్రభుత్వం వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బడా బాబుల ప్రభావానికి తలొగ్గారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. దీంతో కాళిరాజ్ స్థానంలో ఆర్‌.నిశాంతిని నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అసలేం జరిగిందంటే?

కొచ్చి అదనపు జిల్లా జడ్జికి చెందిన 17 ఏళ్ల మైనర్ కుమారుడు అర్థరాత్రి వేళ మెర్సిడెస్ బెంజ్ కార్ ను స్పీడ్ గా నడుపుతూ రీల్స్ చిత్రీకరించేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న జయబాలకృష్ణన్ (55) అనే వీధి వ్యాపారి స్కూటీని అత్యంత వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో జయబాలకృష్ణన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ప్రమాద తీవ్రతకు స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది.

కేసు పక్కదోవ పట్టించే యత్నం

Advertisement

బాధితుడి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదాన్ని సాధారణ ఘటనగా చిత్రీకరించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కొడుకు ఫోన్‌లోని యాక్సిడెంట్ దృశ్యాలను, రీల్స్ వీడియోలను జడ్జి స్వయంగా డిలీట్ చేయించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందే కారు అత్యంత వేగంగా వెళ్తున్న దృశ్యాలను సైతం దర్యాప్తు అధికారులు సేకరించారు. తొలుత పోలీసులు మైనర్‌పై ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించిందనే తేలికపాటి సెక్షన్ల కింద నమోదు చేశారు. అంతేకాకుండా స్టేషన్ బెయిల్‌పై మైనర్ ను విడుదల చేయడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు

వివాదం తీవ్రరూపం దాల్చడంతో సీనియర్ అధికారి ప్రమాద స్థలాన్ని పరిశీలించి పోలీస్ రికార్డులను తనిఖీ చేశారు. బాధితుడి కుటుంబాన్ని కూడా కలసి వివరాలు సేకరించారు. అనంతరం విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. కేరళ అసెంబ్లీలో కూడా ఈ అంశంపై చర్చ జరగగా బాధ్యులైన ఎంతటి వారైనా వదిలేది లేదని హోంమంత్రి రమేష్ చెన్నితల స్పష్టం చేశారు. ఈ పరిణామాల అనంతరం పోలీసులు ఈ కేసులో మరింత కఠిన సెక్షన్లను చేర్చడంతో పాటు కారు యజమాని అయిన జడ్జిని కూడా నిందితుడిగా చేర్చారు. జడ్జి ఫ్లాట్‌కు వెళ్లి పోలీసులు తనిఖీలు కూడా నిర్వహించారు.

Advertisement

Also Read: ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!

పూణే ఘటనను గుర్తుచేస్తున్న కేసు

మరోవైపు బాధితుడి కుటుంబం న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. అయితే ఈ ఘటన 2024 మేలో మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ప్రముఖ రియల్టర్ కుమారుడి పోర్షే కారు ప్రమాదాన్ని గుర్తుచేస్తోంది. నాటి ఘటనలోనూ ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా 15 గంటల్లోనే ఆ మైనర్‌కు బెయిల్ లభించడం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు కొచ్చిలో కూడా అదే రీతిలో పలుకుబడి ఉన్న కుటుంబం కేసును బలహీనపరిచేందుకు ప్రయత్నించిందన్న వార్తలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి.

Also Read: ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!

Tags

Related News

డిజిటల్ అరెస్టుల వ్యవహారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఉక్కుపాదం మోపాలని ఆదేశం

అల్లుడు ఎంత పని చేశాడు.. అత్తింట్లోనే పదే పదే దాడులు, వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్.. ఇండియన్ అమెరికన్ సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్?

రూ. 20 కచోరీ తింటూ.. రూ. 20 లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి.. వీడియో వైరల్!

DPDP చట్టంపై సుప్రీంలో విచారణ.. జర్నలిస్టుల గోప్యత, స్వేచ్ఛపై కేంద్రానికి నోటీసులు!

23 ఏళ్ల యువకుడి ఖతర్నాక్ సైబర్ దందా.. చివరికి ఎలా దొరికాడంటే?

లోకో పైలట్ విధుల్లోకి కొత్త పెళ్లి కూతురు.. కేబిన్‌లో పనులపై వీడియో వైరల్

Big Stories

Advertisement
×