BigTV English

Parag Tyagi: చనిపోయిన భార్యకు గుర్తుగా గుండెపై అలాంటి పని చేసిన నటుడు… నిజమైన ప్రేమ అంటూ!

Parag Tyagi: చనిపోయిన భార్యకు గుర్తుగా గుండెపై అలాంటి పని చేసిన నటుడు… నిజమైన ప్రేమ అంటూ!

Parag Tyagi: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరాగ్ త్యాగి(Parag Tyagi) ఇటీవల కాలంలో ఎంతో బాధను అనుభవిస్తున్నారు. తన జీవిత భాగస్వామి నటి షెఫాలి జరివాలా(Shefali Jariwala) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈమె జూన్ 27 వ తేదీ మరణించారు. ఇలా భార్య మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న నటుడు పరాగ్ త్యాగి తాజాగా తన భార్య ప్రేమకు గుర్తుగా ఆమె ముఖచిత్రాన్ని తన గుండెల పై టాటుగా(Tattoo) వేయించుకొని మరోసారి వార్తల్లో నిలిచారు. తన భార్య నవ్వుతూ ఉన్న ముఖచిత్రాన్ని పరాగ్ త్యాగి వారి 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చాతిపై టాటుగా వేయించుకున్నారు.


నా హృదయంలోనే ఉంటుంది..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోని పరాగ్ త్యాగి తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈయన.. డోస్టన్ నిరీక్షణ చివరకు ముగిసింది. మా 15వ వార్షికోత్సవం సందర్భంగా పారికి నేను ఇచ్చే బహుమతి ఇదే. తాను భౌతికంగా లేకపోయినా ఎప్పుడు నా హృదయంలోనే, నా శరీరంలో ప్రతి అణువు అణువులను ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది చూడగలరు అంటూ చెప్పుకు వచ్చారు. అదేవిధంగా తన భార్య ఫోటోని టాటూగా ఎంతో అద్భుతంగా వేసిన టాటూ ఆర్టిస్ట్ కి కూడా ఈయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


భార్య ప్రేమకు గుర్తుగా…

ఈ విధంగా తన భార్య షెఫాలి జరివాలా ప్రేమకు గుర్తుగా పరాగ్ త్యాగి ఛాతిపై టాటూను వేయించుకోవడంతో ఈయన తన భార్య పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే తన భార్యను ఎంతలా మిస్ అవుతున్నారో కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న లేదా భార్య భర్తలు చనిపోయిన వెంటనే రెండో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కానీ ఈయన మాత్రం తన భార్య ప్రేమను మర్చిపోలేకపోతున్నారని ఇదే నిజమైన ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

?igsh=b3VpaXByMTcwMHhh

ఇకపోతే షెఫాలి జరివాలా జూన్ 27వ తేదీ తన ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈ పూజ కార్యక్రమాలలో భాగంగా ఉపవాసం ఉండటంతో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఈమె యాంటీ ఎజింగ్ టాబ్లెట్లను వేసుకోవటం వల్లే మరణానికి కారణమైందని తెలుస్తోంది. ఉన్నఫలంగా షెఫాలి జరివాలా కుప్ప కూలిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అంధేరీలోని బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మరణించారని వైద్యులు తెలియజేశారు. తన భార్య మరణంతో పరాగ్ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేని ఈయన తన భార్య ప్రేమకు గుర్తుగా గుండె పై టాటూ వేయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Rashmika: “థమా” ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన రష్మిక… భయపెట్టేస్తోందిగా?

Related News

Cm Revanth Reddy: నేషనల్ అవార్డు విన్నర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు 

Skn: ఇలా అయితే సినిమాలు నిర్మించలేం, తేల్చి చెప్పేసిన నిర్మాత

Director Ram Jagadeesh: సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన కోర్టు డైరెక్టర్.. ఫోటోలు వైరల్!

Tamannaah Bhatia: కావాలయ్యా అంటున్న తమన్నా, మేము వస్తాము అంటున్న నెటిజన్స్

Rashmika: “థమా” ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన రష్మిక… భయపెట్టేస్తోందిగా?

Big Stories

×