BigTV English

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Bigg Boss Telugu: తెలుగులో ఇన్ని రియాలిటీ షోస్ వచ్చినా కూడా బిగ్ బాస్ అనే షోకి ఉండే ఆదరణ వేరు. ఈ షోకి విపరీతమైన టిఆర్పి రేటింగ్ వస్తుంది. మొదటి దీనిని తెలుగులో చేసినప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ కు చాలామంది తెలిసిన సెలెబ్రిటీలు వచ్చారు. ఎన్టీఆర్ ఈ షో నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లారు. మొత్తానికి శివ బాలాజీ మొదటి సీజన్ విన్ అయ్యారు.


మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఈ షో ను కొనసాగించారు. అయితే సీజన్లు మారుతున్న కొద్దీ, తెలిసిన సెలబ్రిటీల కంటే తెలుసుకోవాల్సిన సెలబ్రిటీలు ఎక్కువ వచ్చారు. బిగ్ బాస్ కు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన చాలామంది గురించి తరువాత తెలుసుకున్నారు వీక్షకులు. ఇకపోతే బిగ్ బాస్ అందరికీ మంచి ఫేమ్ ఇచ్చింది. ప్రతి ఇంట్లో చూస్తారు కాబట్టి గుర్తింపు అనేది సహజంగా కంటెస్టెంట్లకు వస్తుంది.

కొత్త ఇంట్లోకి అడుగు


బిగ్ బాస్ షో తో గుర్తింపు సాధించిన వాళ్ళలో మానస్ ఒకరు. ఈ షో కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, చాలామంది దృష్టిని తన వైపుకు ఆకర్షించుకున్నాడు. పలు సీరియల్స్ టీవీ షోస్ ద్వారా వచ్చిన గుర్తింపు బిగ్ బాస్ కు వచ్చిన తరువాత రెట్టింపు అయింది. అలానే బిగ్ బాస్ లో రెమ్యూనరేషన్ కూడా గట్టిగా ఉంటుంది. ఇకపోతే మానస్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి యాంకర్ గా కూడా చేస్తున్నారు. ఇక రీసెంట్ గా కొత్త ఇల్లు కొనుక్కొని దానిలో గృహప్రవేశం చేశారు మానస్. ఈ గృహప్రవేశం వీడియోని మానస్ మదర్ పద్మిని నాగులపల్లి ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

?igsh=MXFmOGFzcjh3NnR6OA==

మరో సీజన్ మొదలు 

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 9 వ సీజన్ మొదలుకానుంది. ఇప్పటివరకు జరిగిన సీజన్ అన్నిటికంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని అర్థమవుతుంది. అలానే ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమో లు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు బీభత్సమైన ట్విస్టులు కూడా ఉంటాయి అని అర్థమవుతుంది. సీజన్ 3 నుంచి ఇప్పటివరకు నాగర్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీజన్ కి ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 40 మంది కంటెస్టెంట్ లలో ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి జడ్జెస్ గా బిందు మాధవి, నవదీప్, అభిజిత్ వ్యవహరిస్తున్నారు. ఈ షో కోసం ఎంతో క్యూరియాసిటీతో చాలామంది ఎదురుచూస్తున్నారు.

Also Read: Rahul Sipligunj : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Bejawada Bebakka: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బెజవాడ బేబక్క… ఇల్లు చూశారా ఎంత బాగుందో?

Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఏకంగా 12 రౌండ్లు గన్ షాట్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ నుండి అదిరిపోయే అప్డేట్.. దివ్వెల మాధురి కన్ఫామ్.. మరి దువ్వాడ?

Big Stories

×