Rajasthan News: సమాజంలో రోజు రోజుకీ మానవ సంబంధాలకు మనుగడ లేకుండా పోతుంది. దేశంలో దారుణ ఘటనలు జరుగుతున్నాయి. వాయి, వరుసలు లేకుండా అత్యాచారాలు, ఆ పై హత్యల సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. సొంత కూతురిపై నాన్న అత్యాచారం, సొంత చెల్లితో అన్న అసభ్య ప్రవర్తన, ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య, ప్రియురాలితో భార్యను చంపిన భర్త, ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు, చెల్లిని చంపిన అన్న ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి దారుణ ఘటనలకు పులిస్టాప్ పడడం లేదు. ఎన్ని ఆవెర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించినా చాలా మందిలో మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. డ్రమ్ లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
నీలిరంగు డ్రమ్ములో డెడ్ బాడీ లభ్యం..
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో కిషనగఢ్ బాస్‌లోని ఆదర్శ్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా భయాందోళనను సృష్టించింది. ఇక్కడ ఓ అద్దె ఇంటి మిద్దెపై నీలిరంగ డ్రమ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి డ్రమ్ ను పరిశీలించగా వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ALSO READ: Weather News: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగులు పడే ఛాన్స్
లవర్‌తో కలిసి భర్తను చంపిన భార్య
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మృతుడి భార్య, ఆమె ప్రేమికుడు కలిసి అతడిని దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి, ముగ్గురు పిల్లలను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ కేసుకు సంబందించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు వివిధ బృందాలు ఈ కేసును విచారిస్తున్నాయి.
Husband found dead in a blue-d*um on the rooftop of his rented.
Wife and children along with landlord's son ran away. pic.twitter.com/te75DlPwkt
— ShoneeKapoor (@ShoneeKapoor) August 18, 2025
స్థానికుల్లో భయం భయం..
అల్వార్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడిని ఎందుకు చంపారు..? ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు ఏమిటి..? అనే విషయాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటన వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ కేసు గురించి అప్డేట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Road Accident: హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 11 మందికి తీవ్రగాయాలు..