Parineeti Chopra:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు శుభవార్తలు చెబుతున్నారు. అందులో భాగంగానే కొంతమంది తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే.. ఇంకొంతమంది తల్లిదండ్రులవుతూ అభిమానులకు శుభవార్త తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra) కూడా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడిస్తూ.. “మా చిన్న ప్రపంచం వస్తోంది” అంటూ 1+1=3 అని ఉన్న ఒక ఫోటో అలాగే వీడియోతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇకపోతే 2023 సెప్టెంబర్ లో రాజస్థాన్లోని ఉదయపూర్ లో పరిణీతి చోప్రా..AAP ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నామని శుభవార్త చెప్పడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:The RajaSaab: అక్కడే ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్.. థియేటర్ దద్దరిల్లాల్సిందే!