The Raja Saab: ప్రముఖ డైరెక్టర్ మారుతి (Maruti ) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ప్రభాస్(Prabhas ) హీరోగా.. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్దీ కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. యోగి బాబు (Yogi Babu), సంజయ్ దత్(Sanjay Dutt) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ హార్రర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
ది రాజాసాబ్ మూవీకి లైన్ క్లియర్..
దీనికి తోడు ఇటీవల సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక దీంతో అభిమానులలో మరోసారి కొత్త అనుమానాలు రేకెత్తాయి. కనీసం సంక్రాంతికైనా రిలీజ్ చేస్తారా? అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాజా సాబ్ మూవీకి లైన్ క్లియర్ అయిందని.. రేపటి నుంచే షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
షూటింగ్ అప్డేట్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ది రాజాసాబ్ మూవీకి లైన్ క్లియర్ అయింది. రేపటి నుంచే రాజా సాబ్ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ నెలాఖరు వరకు అజీజ్ నగర్లో షూటింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 28 వరకు ప్రభాస్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 17 నుంచి కేరళలో ప్రభాస్ ఇంట్రడక్షన్ పాట.. ఆ తర్వాత గ్రీస్ లో మరో రెండు పాటలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలు షూటింగ్ పూర్తి అయితే సినిమా షూటింగ్ కూడా మొత్తం పూర్తయినట్లు సమాచారం..
షూటింగ్ ఆగిపోవడానికి కారణం?
షూటింగ్ ఆగిపోవడానికి గల కారణం ఏమిటనే విషయానికొస్తే.. గత 18 రోజులుగా సినీ ఇండస్ట్రీలో కార్మికులు సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమ్మె సమయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సినీ కార్మికులకు మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. అంతేకాదు సినీ కార్మికులకు విశ్వప్రసాద్ నోటీసులు కూడా పంపించారు. దీంతో ఆయన సినిమాలకు పని చేయమని సినీ కార్మికులు తీర్మానించారు. దీంతో టాలీవుడ్ లో సమ్మె ముగిసిన కూడా ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. కానీ ఇప్పుడు సమస్య సద్దుమణిగిందని.. రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఇక వివాదం విషయానికి వస్తే.. సినీ కార్మికులకు స్కిల్స్ లేవని టీజీ విశ్వప్రసాద్ కామెంట్లు చేశారని, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న తమకు స్కిల్స్ లేవని అలా ఎలా చెబుతారు అంటూ కార్మికుల కూడా నిరసనలు చేపట్టారు. అయితే ఇప్పుడు సమస్య తీరినట్లు తెలుస్తోంది.
ALSO READ:OG Shooting : సెప్టెంబర్‌లోనే వచ్చేస్తుంది… ఇంకా షూటింగ్ ఎన్ని రోజులంటే ?