Metro Fare Hikes: ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఈరోజు అంటే ఆగస్టు 25, సోమవారం నుండి టికెట్ ధరలను పెంచుతున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది. 2017లో చివరిసారిగా ఛార్జీలు పెంచింది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్లకు ఇదే మొదటి సారి పెంచడం. ఎక్కువ దూర ప్రయాణానికి 64 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత ధర కంటే 4 రూపాయలు ఎక్కువ. అన్ని మార్గాల్లో టికెట్ ధరలు కనీసం 1 రూపాయి నుంచి గరిష్టంగా 4 రూపాయల వరకు పెరిగాయి.
పెరిగిన టికెట్ వివరాలు ఇవే..
0–2 కి.మీ దూరానికి రూ. 11
2–5 కి.మీ దూరానికి రూ. 21
5–12 కి.మీ దూరానికి రూ. 32
12–21 కి.మీ దూరానికి రూ. 43
21–32 కి.మీ దూరానికి రూ. 54
32 కి.మీ పైగా ప్రయాణానికి రూ. 64
Also Read:Heavy Rains: దేశాన్ని వణికిస్తున్న వాన బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవులు
అదే విధంగా ఎయిర్‌పోర్ట్ లైన్ పై గరిష్టంగా 5 రూపాయల వరకు పెరుగుదల అమలులోకి వచ్చింది. అయితే ఆదివారాలు, పండుగల రోజుల్లో కొంత తక్కువ ఛార్జీలను వర్తింపజేస్తామని మెట్రో అధికారులు తెలిపారు. ఆ రోజుల్లో 0–2 కి.మీ రూ. 11, 2–5 కి.మీ రూ. 21, 5–12 కి.మీ రూ. 32, 12–21 కి.మీ రూ. 43, 21–32 కి.మీ మరియు అంతకంటే ఎక్కువ దూరాలకు రూ. 54 వసూలు చేస్తారు.
ఎందుకు ఛార్జీలు పెంచుతున్నారు?
ఈ ధరల పెంపు సోషల్ మీడియా వినియోగదారులను మాత్రం అసహనానికి గురి చేసింది. దానికి బదులుగా కొత్త సౌకర్యాలు ఏవీ ఇస్తున్నారు అంటూ ఒకరు ప్రశ్నించగా, మరొకరు నేను ప్రతిరోజూ 130 రూపాయలు ఖర్చు చేస్తుంటాను, ఇకపై అది 140 రూపాయలు అవుతుంది. మా జీతం పెరుగుదల కంటే మీరు ఛార్జీలు వేగంగా పెంచుతున్నారు అంటూ విమర్శించారు. ఇంకొందరు వివరమైన ఛార్ట్ ఇవ్వండి. ఈ విధంగా టికెట్ పెంపు ఎందుకు? అంటూ వ్యాఖ్యానించారు.
స్పందన లేదు- ప్రయాణికులు అసహనం
ఢిల్లీ మెట్రో చార్జీలు సడన్‌గా పెరగడంతో ప్రయాణికులు ప్రశ్నిస్తున్నా దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించలేదు. ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. సడన్ చార్జీలు పెచండంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అకస్మాత్తుగా పెరిగిన చార్జీలతో మా ఆదాయాన్ని కూడ ఎక్కవ పెట్టాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2017లో నాల్గవ రేట్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫారసుల ఆధారంగా మెట్రో ఛార్జీలు మార్చబడ్డాయి. అప్పటి వరకు కనీసం రూ. 10, గరిష్టంగా రూ. 60 మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిమితి రూ. 11 నుంచి రూ. 64కి పెరిగింది.