OTT Movie : మిస్టరీ థ్రిల్లర్ల సినిమాలంటే ఇష్టపడే వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక మంచి ట్రీట్ లాంటిది. ఈ సినిమాలో థ్రిల్ మాత్రమే కాదు మైండ్ బెండింగ్ సస్పెన్స్, షాకింగ్ క్లైమాక్స్ కూడా ఉంటాయి. పైగా ఇదొక సౌత్ మూవీ కావడం విశేషం. అలాగే ‘దృశ్యం’, ‘అంధాధున్’ వంటి కథ కోసం వెతికేవారు ఈ చిత్రాన్ని అస్సలు మిస్ చేయకూడదు. ఈ రోజు మనం ఓటీటీలో థ్రిల్, మిస్టరీతో సంచలనం సృష్టించిన ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ సినిమా గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మొత్తం కథ హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఇందులో సాయి పల్లవి హీరోయిన్. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఆహా (Aha)లో స్ట్రీమింగ్
ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Athiran’ (తెలుగులో Anukoni Athidhi). కేరళలోని ఒక మారుమూల మెంటల్ ఆసుపత్రిలో జరిగే రహస్యమైన సంఘటనల చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం ఒక ఆటిస్టిక్ రోగి, ఆమెను దర్యాప్తు చేసే సైకియాట్రిస్ట్ జీవితంలోని సీక్రెట్స్, ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటుంది. ఫహద్ ఫాజిల్ – సాయి పల్లవి నటన, భయంకరమైన వాతావరణం, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతాయి. ఈ సినిమా తెలుగులో Ahaలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది,
కథలోకి వెళ్తే…
1967లో లక్ష్మి (శాంతి కృష్ణ) తన ఇంటికి వచ్చినప్పుడు, కుటుంబ సభ్యుల శవాల మధ్య నిత్య (సాయి పల్లవి) ఒక దారంతో ఆడుకుంటూ పిచ్చిదానిలా కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, 1972లో డాక్టర్ ఎం.కె. నాయర్ (ఫహద్ ఫాసిల్) తిరువనంతపురం మెడికల్ కాలేజ్ నుండి ఒక మెంటల్ ఆసుపత్రిలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్రిటిష్ కాలం నాటి ఒక విశాలమైన మాన్షన్‌కు వస్తాడు. ఈ ఆసుపత్రిని డాక్టర్ బెంజమిన్ డయాజ్ (అతుల్ కులకర్ణి) నడుపుతూ, అసాధారణ చికిత్సలు, “మెమరీ ఎరేసర్” టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నాడని ఫిర్యాదులు ఉన్నాయి.
నాయర్ ఆసుపత్రిలో కేవలం ఐదుగురు రోగులు ఉన్నట్లు గమనిస్తాడు, వారిలో నిత్య అనే ఆటిస్టిక్ అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె బెంజమిన్ కూతురని, ఒక గదిలో బంధించారని అక్కడున్న వారు చెప్తారు. అయితే నిత్య కూడా ఉన్న కళరిపాయట్టు నైపుణ్యం నాయర్ లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. దీంతో అతను ఆమె గతాన్ని వెలికితీయడం ప్రారంభిస్తాడు.
Read Also : మనుషుల్ని చంపి, మాంసాన్ని వండుకుని తినే సీరియల్ కిల్లర్… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ మావా
నాయర్ ఆసుపత్రిలోని రహస్యాలను కనుగొనడానికి ప్రయత్నిస్తూ, బెంజమిన్, అతని భార్య రేణుక (లీనా) ప్రవర్తనను గమనిస్తాడు. గతంలో నిత్య ఆమె తండ్రి (రంజి పనిక్కర్) ఆమెకు కళరిపాయట్టు నేర్పించాడని ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా తెలుస్తుంది. నాయర్ నిత్యను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఓ డైరీ కన్పిస్తుంది. అందులో ఆసుపత్రికి సంబంధించిన రహస్యాలతో పాటు, కథలోని పెద్ద ట్విస్ట్, వినయన్ (డాక్టర్ నాయర్) గుర్తింపు, మానసిక స్థితి గురించిన సీక్రెట్స్ బయట పడతాయి. క్లైమాక్స్‌లో కళరిపాయట్టు యాక్షన్ సన్నివేశాలు, నిత్య గతం గురించి షాకింగ్ సత్యాలు బయటపడతాయి. నిత్యా గతం ఏంటి? అసలు ఈ డాక్టర్ ఎవరు ? ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.