Banakacharla Project: ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో సమావేశం కానున్నారు. జల వివాదంపై చర్చకు సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో.. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. బనకచర్ల విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. గత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిశారు.
కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులతో పాటు కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని ఆదేశించారు.
ALSO READ: Chandrababu TDP : మళ్లీ చక్రం తిప్పిన చంద్రబాబు.. పరపతి తగ్గేదేలే..
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాశారు. గడిచిన పదేండ్లలో కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో కేసీఆర్ సర్కార్ దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి.. ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టిందన్నారు. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడారన్నారు.
ALSO READ: ICF Recruitment: టెన్త్ అర్హతతో 1010 ఉద్యోగాలు.. నెలకు రూ.7వేల స్టైఫండ్.. డోంట్ మిస్
కృష్ణా నీళ్లను యధేచ్ఛగా మళ్లించుకుంటే గత ప్రభుత్వం మౌనం వహించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును 11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టిందని చెప్పారు. దానికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్ష కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిందని అన్నారు.