Karina Kapoor: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే వీరంతా కూడా తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ పట్ల విభిన్న రీతిలో అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి పెద్దగా సెలబ్రిటీల ఫోటోలను ఇంట్లో అతికించుకోవడం వంటివి లేవు కానీ ఒకానొక సమయంలో మాత్రం సినీ వార్త పత్రికలలో తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఫోటో వచ్చిందంటే చాలు వాటిని కట్ చేసి ఇల్లంతా వారి ఫోటోలతోనే నింపేవారు. ఈ విధంగా కూడా ఫాన్స్ వారి అభిమానాన్ని చాటుకునేవారు. అయితే ఒక హీరోయిన్ కూడా ఏకంగా ఒక స్టార్ హీరో పట్ల ఉన్న అభిమానాన్ని చాలా విభిన్నంగా చాటుకున్నారు.
అభిమాన హీరో పోస్టర్..
సాధారణంగా ఎవరైనా అభిమాన హీరో లేదా హీరోయిన్ ఫోటోలను వారి పడకగదిలో పెట్టుకుంటారు కానీ ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా వాష్ రూమ్ లో ఫోటో పెట్టుకున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి కరీనాకపూర్(Karina Kapoor). కరీనాకపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారు. అయితే ఈమెకు నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) అంటే విపరీతమైన అభిమానం ఉండేదని తెలుస్తోంది. ఈ అభిమానంతోనే ఆయన ఫోటోని ఏకంగా తన వాష్ రూమ్ లో పెట్టుకున్నారనే విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ వెల్లడించారు.
కపిల్ శర్మ షో..
సల్మాన్ ఖాన్ తాజాగా కపిల్ శర్మ(Kapil Sharma) హోస్ట్ గా వ్యవహరిస్తున్న, ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో(The Great Indian Kapil Show) కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఈ షో ప్రస్తుతం మూడవ సీజన్ ప్రసారం కావడంతో మొదటి ఎపిసోడ్ లో భాగంగా సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ ఫోటోని బయట షాపులలో ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని కపిల్ శర్మ చూపించారు. ఇది చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ కరీనా కపూర్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అందరితో పంచుకున్నారు. కరీనాకపూర్ నాకు పెద్ద అభిమాని ఆమె నా పోస్టర్ ను ఏకంగా వాష్ రూమ్ లో పెట్టుకున్నారని విన్నాను. అయితే ఓసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా చూశానని తెలిపారు .
8 సంవత్సరాల వయసు…
ఈ విధంగా నా పోస్టర్ వాష్ రూమ్ లో అంటించిన సమయంలో ఆమె వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే అంటూ సల్మాన్ ఖాన్ అసలు విషయం చెప్పారు. ఇక తనకు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన ఫోటో తీసేసి రాహుల్ రాయ్(Rahul Roy) ఫోటో పెట్టుకుంది అంటూ ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చెప్పడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. హీరో పట్ల ఎంత అభిమానం ఉంటేనేంటి ఇలా బాత్రూంలో పోస్టర్లు అతికించాలా అంటూ కరీనాకపూర్ పై విమర్శలు కురిపిస్తున్నారు.. అయితే కరీనాకపూర్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్ బాడీగార్డ్, భజరంగీ భాయ్ జాన్, క్యూంకీ వంటి ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ ఇటీవల సికిందర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కొద్దిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Also Read: Big TV Exclusive : కన్నప్ప ఫ్లాప్ అయితే… కుబేర నుంచి బిగ్ సర్ప్రైజ్