BigTV English

Viral Video: వీధి కుక్కలే పెళ్లి అతిథులు, నెట్టింట వీడియో వైరల్!

Viral Video: వీధి కుక్కలే పెళ్లి అతిథులు, నెట్టింట వీడియో వైరల్!
Advertisement

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అందుకే, ప్రతి ఒక్కరు తమకు ఉన్నంతలో ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించుకుంటారు. కొంత మంది తమ పెళ్లి జీవితాంతం గుర్తుండేలా జరుపుకోవాలని భావిస్తారు. అందులో భాగంగా కొంత మంది నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తే, మరికొంత మంది అనాథ పిల్లలకు అన్నదానాలు చేస్తుంటారు. మరికొంత మంది తమ పెళ్లి సందర్భంగా స్వచ్ఛంద కార్యక్రమాల కోసం విరాళాలు అందిస్తారు. కానీ, తాజాగా ఓ యువకుడు తన పెళ్లి సందర్భంగా చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో అతడి మంచి మనసును అందరూ కొనియాడారు. అంతకీ అతడు ఏం చేశాడంటే..


పెళ్లికి వీధి కుక్కలను పిలిచిన యువకుడు

సాధారణంగా పెళ్లికి బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను ఆహ్వానిస్తారు. కానీ, ఓ యువకుడు తమ గ్రామంలోని వీధి కుక్కలను ఆహ్వానించాడు. అంతే కాదు, తన మిత్రులకు చెప్పి, వాటన్నింటినీ పెళ్లి మండపంలోకి తీసుకురమ్మన్నాడు. వారంతా కష్టపడి వాటిని వివాహ వేదిక మీదికి తీసుకొచ్చారు. వాటితో కలిసి కొత్త పెళ్లి జంట ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నెటిజన్లు ఏం అంటున్నారంటే?

అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి కొడుకు చేసిన ఈ పని జీవితాంతం గుర్తుంటుందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. వీధి కుక్కలను తన పెళ్లికి పిలిచి, వాటికి కడుపు నిండా ఫుడ్ పెట్టి పంపించడం ఎంతో గొప్ప పని అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “పెళ్లి చుట్టుపక్కలకు కుక్కలను రాకుండా తరిమికొట్టే వారిని చూశాం. కానీ, తన పెళ్లికి కుక్కలనే ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం గొప్ప విషయం. నిజంగా నీ మనసు గొప్పది బ్రో” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం సదరు యువకుడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? అనే పూర్తి వివరాలు మాత్రం తెలియదు.

పెళ్లి సందర్భంగా 500 వీధి కుక్కలకు విందు భోజనం

గతంలో పెళ్లి సందర్భంగా ఒడిశాకు కు చెందిన నూతన వధూవరులు 500 వీధి కుక్కలకు విందుభోజనం పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. భువనేశ్వర్ లో యురేకా ఆప్టా, జోవన్నా వాంగ్‌ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం నూతన దంపతులు యానిమల్ వెల్ఫేర్ ట్రస్టు అయిన ఎకమ్రా అనే జంతు సంరక్షణ సంస్థతో కలిసి 500 వీధి కుక్కలకు విందు భోజనం పెట్టి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.

డాగ్స్ షెల్టర్ లో పెళ్లి చేసుకున్న వ్యాపారవేత్త

అటు చైనాకు చెందిన 31 ఏళ్ల యాంగ్‌ అనే వ్యాపారవేత్త కూడా తన పెళ్లిని డాగ్స్ షెల్టర్స్ తో చేసుకున్నాడు.  అదే డాగ్స్ షెల్టర్‌ లో స్వచ్ఛంద సేవకురాలిగా ఉన్న 25 ఏళ్ల జావోను చూసి యాంగ్ ఇష్టపడ్డాడు. కుక్కల పట్ల ఆమె చూపించే ప్రేమ, దయాగుణం యాంగ్‌కి బాగా నచ్చాయి. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లికూడా డాగ్స్ షెల్టర్ లోనే చేసుకుని ప్రశంసలు పొందారు.

Read Also: ఓరి నీ దుంపతెగా.. పాముకే నాగిని డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదరా!

Related News

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!

Diwali Special Sweet: ఈ దీపావళి స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.1.11 లక్షలు

Viral Video: విద్యార్థుల కేరింతల మధ్య.. స్కూల్ బెల్ కొడుతూ భాగోద్వేగానికి గురైన ఉద్యోగి, 38 ఏళ్లు అనుబంధానికి తెర!

Viral News: దీపావళి వేళ 51 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు, మళ్లీ వైరల్ వార్తల్లోకి ఎక్కిన భాటియా!

Viral Video: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: ప్రతిష్టాత్మక కాలేజీలో అమ్మాయిల ఫైటింగ్, నెట్టింట వీడియో వైరల్.. యాజమాన్యం ఏం చేసిందంటే?

Vande Bharath Staff Fight: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో WWE.. చెత్తబుట్టలు, బెల్ట్ లతో కొట్టుకున్న వందే భారత్ సిబ్బంది.. వీడియో వైరల్

Big Stories

×