OG Concert: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం “ఓజీ”(OG). ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే నేడు ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ (OG Concert)ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగ చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్(S.S.Thaman) ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ… ఓజీ సినిమా గురించి ఈ వేదికపై తాను పెద్దగా ఏమీ మాట్లాడనని చాలా తక్కువగా మాట్లాడతానని తెలిపారు. ఇక వేదిక పైనే తమన్ మీసం మెలేస్తూ.. ఇదే తాను ఓజీ సినిమాకు ఇచ్చే రివ్యూ అంటూ చెప్పుకు వచ్చారు. ఇలా ఈయన మీసం లేయడంతో సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చెప్పకనే చెప్పేశారు.
ఫుల్ కాన్ఫిడెన్స్ లో తమన్..
ఈ సినిమా చూసిన అనంతరం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఇంతే గర్వంగా మీసం మెలేస్తారని ఈ సందర్భంగా తమన్ చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు విభిన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఓ.జీ సినిమా విషయంలో అంత కాన్ఫిడెన్స్ ఏంటీ భయ్యా అంటూ స్పందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పై మంచి అంచనాలనే క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా పై ఏర్పడిన బజ్ చూస్తుంటే మాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందేనని తెలుస్తుంది.
నిరాశపరిచిన వీరమల్లు..
పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకొని చాలా కాలం అవుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన హరిహర వీరమల్లు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ క్రమంలోనే అభిమానులు ఓజీ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఓజి సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందా లేదంటే మరోసారి నిరాశకు గురి చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకున్న నేపథ్యంలో సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!