Pawan Kalyan HHVM : పవన్ అభిమానులు 5 ఏళ్ల పాటు ఎదురుచూసిన హరి హర వీరమల్లు మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పిరియాడికల్ పాత్రలో కనిపించబోతున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ అయింది. నిన్న (సోమవారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ ఫుల్ సక్సెస్ కూడా అయింది. అంతే కాదు.. పవన్ సినీ కెరీర్‌లోనే ఫస్ట్ టైం మీడియా ఇంట్రాక్షన్ కూడా చేశాడు.
ఈ మీడియా ఇంట్రాక్షన్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. హరి హర వీరమల్లు నిర్మాత గురించి మాట్లాడాడు. ఎఎం రత్నం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నారని అన్నారు. అయితే ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాకు ఎఎం రత్నం ఎంత ఖర్చు పెట్టాడు ? అందులో ఆయన తీసుకొచ్చిన అప్పులేన్ని అనే వివరాలు చూద్దాం…
హరి హర వీరమల్లు సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020లో సినిమాను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ రావడం, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్, డైరెక్టర్ మార్పు.. ఇలా పలు సమస్యల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీని ఫలితం అభిమానుల ఎదురుచూపులు 5 ఏళ్లు దాటాయి.
బడ్జెట్ డబుల్ అయింది..?
ఇక నిర్మాత వైపు ఆలోచిస్తే… ఆయన పెట్టుకున్న బడ్జెట్ దాటిపోయింది. దాటి పోవడం అంటే ఐదు, పది కాదు.. ఏకంగా మొదట అనుకున్న బడ్జెట్‌కు డబుల్ అయిపోయింది.
సినిమా స్టార్టింగ్‌లో మూవీకి నిర్మాత ఎఎం రత్నం దాదాపు 120 కోట్ల బడ్జెట్‌ను ఎస్టిమేట్ చేశారట. కానీ, పైన చెప్పిన కారణాల వల్ల అది 260 కోట్ల నుంచి 300 కోట్ల వరకు చేరిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది. ఇందులో చాలా వరకు నిర్మాత ఎఎం రత్నం ఫైనాన్షియర్స్ నుంచి అధిక ఇంట్రెస్ట్‌కు అప్పుగా తీసుకువచ్చిందేనట.
సినిమా కోసం అప్పు..?
ఎఎం రత్నం తీసుకు వచ్చిన ఎక్కువ ఫైనాన్స్ సత్య రంగయ్య ప్రసాద్ దగ్గరే అని సమచారం. సత్య రంగయ్య ప్రసాద్ దగ్గర తీసుకొచ్చిన అప్పునకు ఇంట్రెస్ట్ కలిపితే దాదాపు 200 కోట్లు దాటేసిందట. దాన్ని అటు ఇటుగా చూసి దాదాపు 150 కోట్ల వరకు సెట్ చేశారని తెలుస్తుంది.
అంటే సత్య రంగయ్య ప్రసాద్ అనే ఫైనాన్షియర్‌కి ఎఎం రత్నం దాదాపు 150 కోట్ల వరకు అప్పు కట్టాలట. అవి అన్నీ కూడా ఇప్పుడు హరి హర వీరమల్లు మూవీ నుంచే రిటర్న్ రావాల్సి ఉంది.
రత్నంకు వచ్చిన రిటర్న్స్…
ఈ హరి హర వీరమల్లు సినిమా థియేట్రికల్ బిజినెస్ వల్ల రత్నంకు 120 కోట్లు వచ్చాయి. అందులో చాలా వరకు అడ్వాన్స్ రూపంలోనే వచ్చాయట. ఇక ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్నారు. దీనికి రత్నంకు అమెజాన్ వాళ్లు 50 కోట్ల వరకు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ వల్ల కూడా కొంత అమౌంట్ రత్నం చేతికి వచ్చింది. అలాగే మ్యూజిక్ రైట్స్‌ను టిప్స్ తెలుగు తీసుకున్నారు. టిప్స్ తెలుగు నుంచి కూడా కొంత మేర అమౌంట్ వచ్చింది.
ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ సంబంధించిన డబ్బులు రత్నం చేతికి ఇప్పుడే పూర్తి స్థాయిలో రాలేవు. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ నుంచి కొంత వరకు ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తుంది.
ఇంకా చెల్లించాలి..?
150 కోట్ల అప్పులో ఇంత వరకు నిర్మాత రత్నం పెద్దగా ఏం చెల్లించలేదని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన థియేట్రికల్ బిజినెస్ డబ్బులతో పాటు కొంత మేర రావాల్సిన నాన్ థియేట్రికల్ డబ్బులు కలిపి… ఆ ఫైనాన్సియర్ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది.
పాజిటివ్ టాక్ వస్తేనే…
అంత డబ్బు రావాలి… రత్నం సేఫ్ సైడ్ అవ్వాలి అంటే హరి హర వీరమల్లుకు పాజిటివ్ టాక్ రావాల్సింది. ఒక వేళ నెగిటివ్ టాక్ వస్తే.. ఈ సినిమా అనుకున్నంత కలెక్షన్లు రాబట్టడం చాలా కష్టమవుతుదని చెప్పొచ్చు.