Rashmi Gautam: రష్మి గౌతమ్(Rashmi Gautam) పరిచయం అవసరం లేని పేరు. తెలుగు యాంకర్ గా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్ (Extra Jabardasth)కార్యక్రమం ప్రారంభమైన తరువాత యాంకర్ గా ఈమె ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వచ్చిరాని తెలుగులో ఎంతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
డిజిటల్ డీటాక్స్…
ఇదిలా ఉండగా తాజాగా రష్మీ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈమె ఒక నెల రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక పోస్ట్ చేస్తూ..”హలో అందరికీ, ఒక నెల పాటు అవసరమైన డిజిటల్ డీటాక్స్ (Digital Detox)తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరమైన సోషల్ మీడియా ద్వారా మీ తీర్పును తెలుసుకోవచ్చు. అయితే ఈ నెలరోజులు డిజిటల్ డిటాక్స్ అవ్వటం వల్ల మరింత శక్తివంతంగా ఉత్సాహంతో ఉంటానని, నెల రోజుల తర్వాత తాను స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇలా తాను నెలరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఎప్పటిలాగే మీ ప్రేమ మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
యానిమల్ లవర్…
ఇలా ఈ పోస్ట్ ను షేర్ చేసిన ఈమె.. ఏదీ శాశ్వతం కాదు త్వరలోనే తిరిగి వస్తానంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రష్మీ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలతో పాటు యానిమల్స్ గురించి కూడా నిత్యం అభిమానులతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈమె యానిమల్ లవర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఎవరైనా జంతువులకు హాని కలిగిస్తే సోషల్ మీడియా వేదికగా రష్మీ గట్టిగా తన వాదనను వినిపిస్తూ ఉంటారు.
ఇక రష్మీ ప్రస్తుతం బుల్లితెర యాంకర్ గా మాత్రమే స్థిరపడిన కెరియర్ మొదట్లో ఈమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమాలలో నటించినా ఈమె పెద్దగా సక్సెస్ అందుకోని నేపథ్యంలో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈటీవీలో పలు కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) తో కలిసి పెద్ద ఎత్తున స్కిట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా సుడిగాలి సుధీర్ ఈటీవీకి దూరంగా ఉంటున్నారు. తిరిగి సుధీర్ ఈటీవీలోకి ఎంట్రీస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: Samantha: సైలెంట్ గా పెళ్లి పనులు మొదలుపెట్టిన సామ్… ముహూర్తం కూడా ఫిక్స్?