HHVM Trailer Review : ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోదలైందయ్యో ఈ యాలె… ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను చూస్తే యానిమల్ మూవీలోని ఈ సాంగే గుర్తొస్తుంది. ఈ క్షణం కోసం వాళ్లు పాపం దాదాపు ఆరేళ్ల నుంచి వెయిట్ చేశారు. కథ మార్చారు. ఒక్క పార్ట్ కాస్త రెండు పార్ట్స్ అయ్యాయి. దాదాపు 60 శాతం సినిమా చేసిన డైరెక్టరే మారిపోయాడు. ఇంకా చాలా అయ్యాయి ఈ సినిమా తీసే టైంలో. అన్ని ఎదుర్కొంటూ ఫైనల్ ఈ రోజు హరి హర వీరమల్లు ట్రైలర్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ డీటైల్డ్ రివ్యూ చూద్దాం…
మూడు నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్‌లో ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్‌పైనే పెట్టారు. మిగితా పాత్రలను జస్ట్ అలా చూపించి వదిలేశారు. కానీ, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, కొన్ని యాక్షన్ సీన్స్‌కు ప్రియారిటీ ఇస్తూ ఈ మూడు నిమిషాల ట్రైలర్‌ను కట్ చేశారు.
ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే… బేస్‌తో వచ్చిన అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసేలా చేసింది. దీని తర్వాత “హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం” అనే డైలాగ్ ఓ వర్గం ఆడియన్స్ కనెక్ట్ చేసేలా చేసింది.
ఇక దీని తర్వాత సినిమాలోని చాలా పార్ట్స్ అన్ని కత్తిరించి ఒక దగ్గర పేర్చి.. పవన్ కళ్యాణ్ హైలైట్ అయ్యేలా చూసుకుంటూ ట్రైలర్ రెడీ చేశారు అన్న ఫీల్ వస్తుంది.
ఇక వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బానే సెట్ అయింది. కానీ, మరి కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ పనితనం తేలిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కనబడ్డ కొన్ని షాట్స్ ఆర్టిఫిషియల్ అన్నట్టే ఉన్నాయి. వాటిని కాస్త సరిదిద్దుకోవాల్సింది.
“ఇప్పటి దాకా మేకల్ని వేటాడే పులిని చూసి ఉంటారు
ఇప్పుడు పులిల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు”
“నేను రావాలని చాలామంది దేవుడికి దండం పెట్టుకొంటూ ఉంటారు.
కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు”
లాంటి డైలాగ్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం పెట్టినట్టు ఉంది. అలాగే.. ఇవి ఆయన పొలిటికల్ కెరీర్‌కు కనెక్ట్ అయ్యేలా కూడా ఉన్నాయి.
లాస్ట్‌లో బాబీ డియోల్‌తో “అంధీ వచ్చేసింది” అనే డైలాగ్ చెప్పించారు. నిజానికి ఈ వర్డ్ మోడీది. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్‌ను మోడీ “అంధీ” అని అంటాడు. అంధీ అంటే తూఫాన్. పవన్ ను మోడీ పిలిచిన ఆ మాటను హరి హర వీరమల్లులో వాడేశారు.
ఇక ట్రైలర్ లాస్ట్‌లో నక్కతో పవన్ తలపడినట్టు చూపించారు. దీన్ని చూస్తే ఆర్ఆర్ఆర్ మూవీలో పులితో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ ఎపిసోడ్ అందరికీ గుర్తొస్తుంది.
మొత్తంగా చూస్తే… ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్‌ను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. కొన్ని లోటుపాట్లు ఉన్నా… వాటిని పవన్ కళ్యాణ్ స్వాగ్ కవర్ చేసేసింది.
నిర్మాతలు అనుకున్న బిజినెస్ జరగాలంటే… పవన్ ఫేస్‌తోనే మాత్రమే సాధ్యం అవుతుంది. అదే ఇప్పుడు ట్రైలర్‌లో చూపించారు. ఇదే స్పీడ్ సినిమాలో ఉంటే పర్లేదు. కానీ, స్పీడ్ ఉన్న మూమెంట్సే ఇక్కడ చూపించి.. మిగితా సినిమా అంతా డల్‌గా ఉంటే ఏం చేయలేం.
అప్పుడు అంధీ (తుఫాన్) అడ్డంగా ఆగిపోవడమే అవుతుంది.