Nothing Phone 3 vs iPhone 16| నథింగ్ ఫోన్ 3 భారతదేశంలో ఇటీవలే అధికారికంగా విడుదలైంది. ఈ ఫోన్ నథింగ్ కంపెనీ నుంచి మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ప్రీమియం ఫోన్ల విభాగానికి చెందిన ఈ ఫోన్ ధర ఐఫోన్ 16 కంటే ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. నథింగ్ ఫోన్ 3లో కస్టమైజ్ చేయగల గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉండడం ప్రత్యేకం. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లను నెటిజెన్లు ఐఫోన్ 16 తో పోలుస్తున్నారు. అందుకే ఈ రెండు ఫోన్ల ధరలు, ఫీచర్లను ఒకసారి పోల్చి చూద్దాం.
డిస్‌ప్లే: నథింగ్ ఫోన్ 3లో 6.67-అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీనితో స్క్రీన్ స్మూత్‌గా, బ్రైట్‌గా కనిపిస్తుంది. ఐఫోన్ 16లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది 2000 నిట్స్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ డిస్‌ప్లే రంగులు, క్లారిటీ అద్భుతంగా ఉన్నప్పటికీ, నథింగ్ ఫోన్ 3 డిస్‌ప్లే స్మూత్‌నెస్‌లో ముందంజలో ఉంది.
పనితీరు: నథింగ్ ఫోన్ 3 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని పవర్ ఫామెన్స్ చాలా పవర్ ఫుల్. ఎందుకంటే ఇందులో 12GB లేదా 16GB RAM ఉంటుంది. దీంతో మల్టీటాస్కింగ్ సులభం. ఐఫోన్ 16 ఆపిల్ A18 చిప్‌సెట్, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది iOS కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. AI సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఐఫోన్ పనితీరు స్థిరంగా, వేగవంతంగా ఉంటుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు: నథింగ్ ఫోన్ 3లో 5,150mAh బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 16లో 3,561mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆపిల్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల ఐఫోన్ బ్యాటరీ రోజంతా ఉపయోగపడుతుంది. కానీ నథింగ్ ఫోన్ 3 ఛార్జింగ్ వేగంలో మరియు బ్యాటరీ సామర్థ్యంలో ఐఫోన్ కంటే ముందంజలో ఉంది.
కెమెరా: నథింగ్ ఫోన్ 3లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్, 50MP పెరిస్కోప్, 50MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50MP ఉండడంతో అద్భుతమైన క్లారిటీతో వీడియో కాల్స్, సెల్ఫీలు ఉంటాయి. ఐఫోన్ 16లో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆపిల్ యొక్క కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది, కానీ నథింగ్ ఫోన్ 3 కెమెరా ఆప్షన్స్‌లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని అందిస్తోంది. అందుకే కెమెరా విషయంలో కూడా నథింగ్ ఫోన్ 3 చాలా బెటర్.
డిజైన్, ఫీచర్స్
రెండు ఫోన్‌లు IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3.. గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్ దీన్ని ప్రత్యేకంగా చేస్తుంది. ఇది నోటిఫికేషన్స్, టైమ్, యానిమేషన్స్ చూపిస్తుంది. ఐఫోన్ 16 సాంప్రదాయ ఆపిల్ డిజైన్‌తో వస్తుంది. ఇది ప్రీమియం డిజైన్ గా గుర్తించదగినది. ఐఫోన్ 16లో ఫేస్ ID, అల్ట్రా వైడ్‌బ్యాండ్ సపోర్ట్, ఎమర్జెన్సీ SOS వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఆపిల్ ఎకోసిస్టమ్‌ను ఇష్టపడే వారికి ఆకర్షణీయంగా ఉంటాయి.
Also Read: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!
ఏది ఎంచుకోవాలి?
నథింగ్ ఫోన్ 3 ధర రూ. 79,999 నుండి మొదలవుతుంది, ఐఫోన్ 16 ధర రూ. 73,000 నుండి మొదలవుతుంది. నథింగ్ ఫోన్ 3 ఆండ్రాయిడ్ ప్రియులకు, ప్రత్యేక డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే వారికి అనువైనది. ఐఫోన్ 16 ఆపిల్ ఎకోసిస్టమ్, స్థిరమైన పనితీరు, అద్భుతమైన కెమెరా అనుభవాన్ని ఇష్టపడే వారికి మంచి ఎంపిక. మీ బడ్జెట్, ప్రాధాన్యతల ఆధారంగా ఎంచుకోండి.