HHVM Trailer : అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ (Harihara Veeramallu Trailer) ఎట్టకేలకు కొద్ది క్షణాల క్రితం విడుదలైంది. అయితే ఈ ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలకు అభిమానులు ఒకరకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ట్రైలర్లో ప్రముఖ నటుడు సత్యరాజ్ (Sathyaraj) కనిపించడమే ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణం అని చెప్పాలి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో సత్యరాజ్ ఒక శాస్త్రి పాత్రలో చేతిలో బాలుడిని పట్టుకొని శివుడి లింగం ముందు వేడుకుంటున్నట్టు ట్రైలర్లో చూపించారు. ఈ సన్నివేశం అక్కడ బాగానే ఉన్నా సత్యరాజు ఆ పాత్రలో ఉండడం చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత్ర మాత్రమే కాదు అసలు సినిమా నుండే తీసేయండి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
లైఫ్ ఇచ్చినోడినే తిట్టావా సత్యరాజ్..
ఇకపోతే ట్రైలర్లో సత్యరాజ్ ఉండడం చూసి కొంతమంది నెటిజన్స్ కూడా “లైఫ్ ఇచ్చినోడినే తిట్టావు కదా” అంటూ కామెంట్లో చేస్తున్నారు.. ఎంతైనా పవన్ కళ్యాణ్ మంచోడని తనను ఎంతమంది ఏమన్నా వారికి జీవితాన్ని ప్రసాదించడంలో ముందుంటారు అని కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
అసలేం జరిగిందనే విషయానికొస్తే.. గత కొన్ని రోజుల క్రితం తమిళనాడులో జరిగిన మురుగన్ మానాడు మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్.. “నాస్తికులు హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు” అంటూ కామెంట్లు చేశారు. అయితే ఇవి సంచలనంగా మారడంతో ఈ కామెంట్లపై సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు డైరెక్ట్ గా కౌంటర్ వేశారు.. వీసీకే అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న సత్యరాజ్ మాట్లాడుతూ.. “దేవుడి పేరుతో తమిళనాట రాజకీయాలు చేస్తే ఊరుకోము. మురుగన్ మానాడు పేరుతో మమ్మల్ని మోసం చేశాం అనుకుంటే, అది మీ తెలివి తక్కువ తనమవుతుంది. తమిళ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మురుగన్ మానాడు పేరుతో పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన మమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. ఇకపై మీ ఆటలు తమిళనాట సాగవు” అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు
అప్పటికీ.. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ కు అండగా..
అయితే అలా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేసిన సత్యరాజ్ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ లో కనిపించేసరికి అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంత గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తున్న హీరోని నువ్వు అవమాన పరుస్తున్నావు. సుదీర్ఘకాలంగా ఆయనతో సినిమా షూటింగ్లో ట్రావెల్ చేశావు కదా.. ఆయన మనస్తత్వం ఏంటో నీకు తెలియదా.. అంటూ అభిమానులు పవన్ కళ్యాణ్ కు అండగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ను సత్యరాజ్ అంతలా మాటలు అంటుంటే ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ కి అభిమానులే అండగా ఉన్నారు. ఇక అందుకే ఆ అభిమానులే ఇప్పుడు సత్యరాజ్ సన్నివేశాలను సినిమా నుండి తీసేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ:Nayanthara: మోసం చేసి నన్ను వాడుకున్నారు.. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన నయనతార!