BigTV English

Thammudu Twitter Review: ‘తమ్ముడు ‘ ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?

Thammudu Twitter Review: ‘తమ్ముడు ‘ ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?

Thammudu Twitter Review: టాలీవుడ్ హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం తమ్ముడు.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రిలీజ్ అయింది. కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.. దాదాపు 75 కోట్లకు పైగా నిర్మాత దిల్ రాజు ఖర్చు చేశారు. ట్రైలర్స్, పోస్టర్స్ తో మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ పై పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది?.. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది? సినిమా నితిన్ కు హిట్ అందించిందా? ట్విట్టర్ రివ్యూ ఒకసారి చూసేద్దాం..


తమ్ముడు మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు.. చాలా ఫ్లాట్ స్క్రీన్‌ప్లేతో చిన్న స్టోరీతో ఉంది. దర్శకుడు ప్రత్యేకమైన బ్యాక్‌డ్రాప్ మరియు ప్రెజెంటేషన్‌ని అందించడానికి ప్రయత్నించాడు, ఇందులో కొంత కొత్తదనం ఉంది, కానీ ఇప్పటివరకు అన్ని సన్నివేశాలకు సరైన సెటప్ మరియు ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. ఫస్ట్ హాఫ్ తేలిపోయింది.. సెకండ్ హాఫ్ లో స్టోరీ చూపిస్తాడేమో అని ట్వీట్ చేశాడు..

నితిన్ తమ్ముడు కోసం పెద్ద సాహసమే చేశాడు. ఒక్క రాత్రిలో సినిమాను చూపించారు. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కొత్త కంటెంట్ తో థియేటర్లలోకి వచ్చింది. తెలుగు సినిమాకి 2025 ద్వితీయార్థంలో ప్రారంభం కానున్నందున ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మరొకరు ట్వీట్ చేశారు.

వకీల్ సాబ్ సినిమా తర్వాత తమ్ముడు అనే పవర్‌ఫుల్ సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ వస్తున్నాడు. నితిన్ కూడా హిట్ కొట్టేందుకు సిద్దమయ్యాడు. ఈ ఇద్దరికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సినిమాకు రావాలని కోరుకొంటున్నాను. శక్తిమంతమైన మహిళలకు ప్రతీకగా తమ్ముడు మూవీ వస్తున్నది..ఈ మూవీలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తమ్ముడు ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఒక్క రాత్రిలో జరిగే సంఘటన బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించారు. మల్టీపుల్ లేయర్స్‌తో కథను రూపొందించారు. ఈ సినిమా కంటెంట్ డ్రైడ్ చేసే మూవీ. ఖచ్చితంగా హిట్ అవుతుందని ట్వీట్ చేశారు.

అలాగే హీరో వరుణ్ తేజ్ కూడా నితిన్ తమ్ముడు కు ఆల్ ది బెస్ట్.. వేణు శ్రీరామ్ కు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.

మొత్తానికి తమ్ముడు మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సెకండ్ హాఫ్ లో స్టోరీ తెలిసిపోతుంది. ఇప్పటివరకు పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. మొదటి షో అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Related News

Tehran Movie Review : ‘టెహ్రాన్’ మూవీ రివ్యూ… యాక్షన్‌‌తో దుమ్మురేపే గ్లోబల్ స్పై థ్రిల్లర్

Coolie Movie Review : కూలీ మూవీ రివ్యూ… లోకి ‘లో’ మార్క్

WAR 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. జస్ట్ వార్ – నో రోర్

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?

Big Stories

×