BigTV English

OTT Movie : పిలవని పేరంటానికి ఇన్విటేషన్… తీరా అక్కడికెళ్తే వణికించే బ్లడ్ బాత్… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : పిలవని పేరంటానికి ఇన్విటేషన్… తీరా అక్కడికెళ్తే వణికించే బ్లడ్ బాత్… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie :  వాంపైర్  సినిమాలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ సినిమాలలో బ్లడ్ బాత్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాంపైర్  సినిమాలో, ఒక అమ్మాయి కోరి కొరివితో గోక్కుంటుంది. DNA టెస్ట్ చేయించుకుని చిక్కుల్లో పడుతుంది. ఈ సినిమా చివరివరకూ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ఇన్విటేషన్’ (The Invitation). 2022 లో వచ్చిన ఈ సినిమాకి జెస్సికా ఎం.థాంప్సన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్రామ్ స్టోకర్ రచించిన “డ్రాకులా” అనే నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో నటాలీ ఇమ్మాన్యుయెల్, థామస్ డోహెర్టీ ప్రధాన పాత్రలలో నటించారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDB లో ఈ సినిమాకి 5.3/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

న్యూయార్క్ నగరంలో ఎవెలిన్ అనే ఒక అమ్మాయి తన తల్లి మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆమె ఒంటరిగా ఉండటం వలన ఒక ఆలోచన వస్తుంది. ఒక DNAటెస్ట్ చేస్తే , తన బంధువులు ఎవరైనా ఉంటే తెలుస్తుందని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఒక DNAటెస్ట్ చేయించుకుంటుంది. దీనికి దగ్గరగా, ఇంగ్లాండ్‌లో ఒలివర్ అలెగ్జాండర్ DNA సరిపోతుంది. తీరా అతను ఎవెలిన్ కు దూరపు బంధువని తెలుస్తుంది. ఇక అతన్ని కలవాలని నిర్ణయించుకుంటుంది. ఒలివర్ ఆమెను ఇంగ్లాండ్‌లోని ఒక గొప్ప వివాహానికి ఆహ్వానిస్తాడు. అక్కడ ఆమె తన కుటుంబాన్ని కలవచ్చని చెబుతాడు. ఎవెలిన్ ఈ ఆహ్వానాన్ని స్వీకరించి,ఒక పురాతన గోతిక్ మానర్‌కు వెళ్తుంది. అక్కడ మానర్ యజమాని వాల్టర్ డి విల్లే ఆమెకు స్వాగతం పలుకుతాడు. ఎవీ మొదట్లో వాల్టర్ లుక్ కి లొంగిపోతుంది. ఈ పెళ్ళి వేడుకలు ఒక అద్భుతమైన అనుభవంగా అనిపిస్తాయి.

అయితే ఈ సమయంలో ఆమె తన బామ్మ గురించి ఒక రహస్యాన్ని తెలుసుకుంటుంది. ఆమె ఒక బ్లాక్ ఫుట్‌మన్‌తో రహస్యంగా ఒక బిడ్డను కన్నదని, ఇది ఈ కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నదని తెలుస్తుంది. ఇక ఈ మానర్‌లో వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. ఎవెలిన్ తన కుటుంబం రహస్యాలను కనిపెడుతుంది. వాల్టర్ వాస్తవానికి ఒక వాంపైర్ అనే విషయం కూడా తెలుస్తుంది.  ఎవెలిన్ ను ఈ వివాహానికి ఆహ్వానించడం వెనుక ఒక కుట్ర ఉంటుంది. ఆమెను వాల్టర్ భార్యగా చేసుకోవాలనుకుంటాడు. ఎవీ ఈ భయంకరమైన కుట్రను తెలుసుకుని, అక్కడి నుంచి బయటపడటానికి పోరాడుతుంది. ఆమె తన స్నేహితురాలు గ్రేస్‌తో కలిసి, ఈ వాంపైర్ కుటుంబాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతుంది. చవరికి ఎవెలిన్ వాల్టర్ ను ఎదిరిస్తుందా ? అతను ఆమెను ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు ? గతంలో ఈ వాంపైర్ కుటుంబానికి, ఎవెలిన్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్  సినమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : దెయ్యంతో పెళ్లి డీల్… ఫ్యామిలీలో వరుస హత్యలు… కలలో కూడా ఊహించని డేంజరస్ హర్రర్ స్టోరీ

Related News

OTT Movie : తాగుబోతుకు గుడ్ డే… మైకంలోనే కేసును సాల్వ్ చేసే మతలబు… ఐఎండీబీలో రేటింగ్ 8 ఉన్న తమిళ మూవీ

OTT Movie: ఫ్రెండ్‌ను ఆవహించి.. 7 రోజులు గత్తరలేపే దెయ్యం.. ఇండోనేషియాలో రికార్డులు బ్రేక్ చేసిన హార్రర్ మూవీ ఇది

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 5000 కోట్ల సూపర్ హిట్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : ఎమ్మెల్యే ఇంట్లో పనసకాయలు మిస్సింగ్… గిలిగింతలు పెట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా

Wednesday season 2 Trailer : ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్.. మతిపోయే ట్విస్ట్.. లేడీ గాగా వచ్చేస్తుందిరోయ్..!

OTT Movie : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×