OG Film Story: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం వలన ఈ సినిమాకి డేట్లు సరిగ్గా కేటాయించకపోవడం వలన ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది.
మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయిపోయింది. ఎట్టి పరిస్థితులను సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ పదే పదే చెబుతుంది. సినిమా నుంచి ఏ అప్డేట్ పోస్టర్ వచ్చినా కూడా ఆ పోస్టర్ పైన రిలీజ్ డేట్ ను తప్పనిసరిగా వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసి చాలా రోజులైంది. స్ట్రైట్ సినిమాగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఈ తరుణంలో నమ్మకాలన్నీ ఓజి సినిమాపై పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కథ ఒకటి వినిపిస్తుంది.
ఓజి స్టోరీ లైన్
ముంబై అండర్ వరల్డ్ నుండి పూర్తిగా మాయమయిన మాబ్ బాస్ ‘ఓజస్ గంభీర’ మళ్ళీ తిరిగివస్తాడు…ఈ సారి ముందుకన్నా ఇంకా పవర్ ఫుల్ గా,భయం లేకుండా,అన్ స్టాపబుల్ అనేలా…అయితే ఇప్పుడు అతని గోల్ ఒకటే…అదేంటంటే ప్రస్తుతం శాసిస్తున్న నిరంకుశ శత్రువు అయిన ఓమి భావు ని మట్టికరిపించి తన సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం…అలా నమ్మకస్థులు మారిపోతారు,అలియన్స్ లు మారతాయి అప్పుడు OG ఒక బ్రూటల్ క్రిమినల్ వార్ మళ్ళీ మొదలుపెడతాడు.వాళ్ళకి ఎదురుపడి నమ్మకద్రోహానికి బదులు ఎలా తీర్చుకుంటాడు అనేది OG. అయితే అసలు ఓజస్ గతం ఏంటి?,పదేళ్లు ఎక్కడికి వెళ్ళాడు,అక్కడ ఏం చేసాడు అనేవి కిక్ ఇచ్చేపాయింట్స్. అందుకే సినిమా నుండి మొదటి విడుదలైన వీడియోలో మళ్ళీ అలాంటోడు తిరుగుతున్నాడు అంటే అనే లైన్ రాసాడు సుజిత్.
మంచి వరల్డ్ బిల్ట్ చేశాడు
ఇక ఈ కథ వినగానే చాలామందికి సినిమా మీద నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. ఇదే కథను సుజిత్ ప్లాన్ చేసి ఉంటే మంచి వరల్డ్ బిల్డ్ చేశాడని చెప్పొచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా ఇంప్రసివ్ గా అనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయిన సువ్వి సువ్వి పాటలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా షాకింగ్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ను అంత అందంగా చూసి చాలా రోజులు అయింది. మొత్తానికి సుజిత్ అభిమానులు కోరుకునే పవన్ కళ్యాణ్ ను వెండితెరపై ఆవిష్కరించనున్నాడు.
Also Read: Allari Naresh: అల్లరి నరేష్ మళ్లీ రూట్ మార్చాడు. ఈసారి కామెడీ కాదు కాన్సెప్ట్ కాదు