BigTV English

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా థ్రిల్లర్ జానర్ లో వస్తున్న వెబ్ సిరీస్ లను, ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి మేకర్స్ కూడా సరికొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక థ్రిల్లర్ సిరీస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ కథ మానసిక ఆసుపత్రిలో జరుగుతున్న దారుణాలను, ఒకఇన్స్పెక్టర్ బయట పెట్టడానికి చేసే ప్రయత్నంలో ఈ కథ నడుస్తుంది. ఈ సిరీస్ పేరేమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘వేవర్డ్’ (Wayward) 2025లో వచ్చిన ఎనిమిది ఎపిసోడ్‌ల థ్రిల్లర్ సిరీస్. దీనిని మే మార్టిన్ సృష్టించి, నటించారు. ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో మే మార్టిన్ (అలెక్స్ డెంప్సీగా), టోని కొలెట్ (ఎవెలిన్ వేడ్‌గా), సారా గాడన్ (లారా రెడ్‌మన్‌గా), పాట్రిక్ జె. ఆడమ్స్ (వ్యాట్ టర్నర్‌గా), సిడ్నీ టోప్‌లిఫ్ (అబ్బీగా), అలివియా అలిన్ లిండ్ (లీలాగా) నటించారు. IMDbలో ఈ సిరీస్ 7.3/10 రేటింగ్ పొందింది. ప్రతి ఎపిసోడ్ సుమారు 40-50 నిమిషాల రన్‌టైమ్ తో, ఇంగ్లీష్ ఒరిజినల్‌లో, తెలుగు, హిందీ, డబ్బింగ్ తో అవైలబుల్ గా ఉంది.

కథలోకి వెళ్తే

టాల్ పైన్స్ అనే సుందరమైన పట్టణంలో ఈ కథ జరుగుతుంది. ఇక్కడ అలెక్స్ డెంప్సీ అనే పోలీస్ అధికారి, తన ప్రెగ్నెంట్ భార్య లారా తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వస్తాడు. అలెక్స్ మొదటి రోజు డ్యూటీలో ఉండగానే, ఒక షాకింగ్ ట్విస్ట్ ఎదురుపడుతుంది. టాల్ పైన్స్ అకాడమీ అనే మానసిక సమస్యల క్యూర్ కోసం ఏర్పాటు చేసిన స్కూల్ నుండి, ఒక యువకుడు తప్పించుకుని అతని కారు ముందు పరిగెత్తడాన్ని చూస్తాడు. ఈ అకాడమీ ఎవెలిన్ అనే వింత మహిళ నడుపుతుంటుంది. ఆమె చూడటానికి అనుమానస్పదంగా ఉంటుంది. ఈ అకాడమీలో టీనేజ్ పిల్లల సమస్యలను పరిష్కరిస్తామని ఆమె ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. అలెక్స్ ఈ అకాడమీలో జరుగుతున్న విషయాలపై అనుమానం పెంచుకుంటాడు. ఈ సమయంలో అబ్బీ, లీలా ఇద్దరు విద్యార్థులు, తమను తాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, అకాడెమీలో రహస్యాలను వెలికితీసేందుకు అలెక్స్ తో చేతులు కలుపుతారు.


అలెక్స్, అబ్బీ, లీలా కలిసి టాల్ పైన్స్ అకాడమీ కుట్రలను బయట పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎవెలిన్ తన మాయమాటలతో అకాడమీలో జరిగే అనైతిక చర్యలను దాచిపెడుతుంది. అలెక్స్ దర్యాప్తు సాగే కొద్దీ ఎవెలిన్ గతంలోని రహస్యాలను తెలుసుకుంటాడు. ఈ కథ ఉత్కంఠ భరిత క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఈ దర్యాప్తు సమయంలో అనేక ఆటంకాలను ఎదుర్కొని, అలెక్స్, అబ్బీ, లీలా కలసి ఎవెలిన్ నిజ స్వరూపాన్ని, టాల్ పైన్స్ అకాడమీ వెనుక దాగి ఉన్న భయంకర రహస్యాలను బయటపెడతారు. వీళ్ళు బయట పెట్టే సీక్రెట్స్ ఏమిటి ? ఇంతకీ టాల్ పైన్స్ అకాడమీలో ఏమి జరుగుతోంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : అడుగు పెట్టగానే కుప్పకూలే కలల సౌధం… చివరి వరకూ ట్విస్టులే… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ థ్రిల్లర్

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×