BigTV English
Advertisement

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

TGPSC Group-1: గ్రూప్ -1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ బుధవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. న్యాయ వివాదం నేపథ్యంలో ఓ పోస్టును విత్‌ హెల్డ్‌లో పెట్టినట్టు తెలిపారు. మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేసింది టీజీపీఎస్సీ.


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్ -1 అభ్యర్థులకు ఈనెల 27న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో నిర్వహించనున్న కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత ఉన్నత అధికారులతో ఈ రోజు సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రూప్-1 ద్వారా ఎంపికైన 562 మంది అభ్యర్థులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందజేయనున్నట్టు సిఎస్ తెలిపారు. ఈ గ్రూప్-1 పోస్టుల కింద దాదాపు 18 శాఖలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ కూడా ఆహ్వానిస్తున్నట్టు సి.ఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి ఒక్కొక్క అభ్యర్థికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.


ఈ నియామకాల్లో అత్యధికంగా, రెవిన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉండడంతో.. రెవిన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 ఏళ్లు సర్వీస్ లో ఉంటారు కాబట్టి.. వారికి ఉత్తేజకరమైన వాతావరణంలో నియామక పత్రాలు అందచేయాలని, ప్రభుత్వ సర్వీస్ పట్ల వారికి ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు తగు ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

ALSO READ: Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

ఈ టెలి కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సబ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ జితేందర్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టీకే శ్రీదేవి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.

ALSO READ: Apprentice Posts: రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. పది పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంకెందుకు ఆలస్యం

Related News

Brs Jubilee Hills: అదే ఓవర్ కాన్ఫిడెన్స్.. బీఆర్ఎస్ లో ఏ మార్పు లేదు

Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. భయాందోళనలో ప్రయాణికులు

Ande Sri: గొడ్ల కాపరి నుంచి.. గేయ రచయితగా.. ప్రజాకవి అందెశ్రీ బయోగ్రఫీ

Kcr Campaign: జూబ్లీహిల్స్ ప్రచార బరిలో కేసీఆర్.. చివరకు అలా ముగించారు

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: ఎన్నికల అధికారి కర్ణన్

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?

Big Stories

×