Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఓజీ సినిమా(OG Movie) ఎన్నో అంచనాల నడమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు దాదాపు మూడు సంవత్సరాలు పాటు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక సినిమా పట్ల టాక్ కూడా మంచిగా ఉన్న నేపథ్యంలో థియేటర్లలో అభిమానుల హంగామా మామూలుగా లేదనే చెప్పాలి. ఏకంగా చొక్కాలు చింపుకుంటూ అభిమానులు ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు చొక్కాలు చింపుకుని బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్(Prasad Multiplex) యాజమాన్యం పవన్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం పవన్ కళ్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ చొక్కాలు చింపుకొని బయటకు వస్తున్నారు. కావున మీరు ఓజి సినిమా చూడటానికి వచ్చేటప్పుడు అదనంగా మరొక టీ షర్ట్ తెచ్చుకోవడం మంచిది అంటూ ఈ సందర్భంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ పవన్ కళ్యాణ్ అభిమానులను కోరుతూ విడుదల చేసిన ఈ లెటర్ వైరల్ అవుతుంది. ఒక థియేటర్ యాజమాన్యం ఇలా మరొక చొక్కా అదనంగా తెచ్చుకోండి అని చెప్పారంటే పవన్ కళ్యాణ్ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో స్పష్టం అవుతుంది.
పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలను కూడా తగ్గించారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం కమిట్అయిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పటికే ఈయన హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు ఓజీ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లలో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఓజీకి సీక్వెల్ రాబోతోందా?
ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శిద్దమవుతున్న నేపథ్యంలో పలుచోట్ల అభిమానులు కాస్త అత్యుత్సాహం కనబరుస్తూ స్క్రీన్ లను ద్వంశం చేయడంతో పలుచోట్ల షోలను నిలిపివేశారు. అలాగే మరికొన్ని ప్రాంతాలలో థియేటర్లు అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం కూడా చోటుచేసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత తమ అభిమాన హీరో సోలోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.. ఇక ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే