Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజి. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు పవర్ స్టార్ అని అరిచిన వీడియో ఓజీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు విపరీతంగా వైరల్ అయింది.
పవన్ కళ్యాణ్ తో ఒక రీమేక్ సినిమా చేయడానికి సుజిత్ వెళ్ళాడు. కానీ సుజిత్ దగ్గర ఒరిజినల్ స్టోరీ ఒకటి బాగా పవన్ కళ్యాణ్ కి నచ్చడంతో, సుజిత్ కు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కూడా పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేశారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు.
ఓ జి సినిమాకి సంబంధించిన కన్సర్ట్ ఈరోజు జరిగింది. ఈ కన్సర్ట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. సుజీత్ స్థాయి, సుజిత్ విజన్ నెక్స్ట్ లెవెల్. జానీ సినిమా చూసిన తర్వాత ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు కూడా ఆ హెడ్ బ్యాండ్ దాచేసారు. సుజీత్ కు ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి అని.
సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అనే ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు. మీరు అతనితో చేస్తే చాలా బాగుంటుంది. అని నా దగ్గరికి సుజీత్ ను పరిచయం చేశాడు. దానయ్య గారి ద్వారా. సుజిత్ ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా తక్కువ. కానీ సెట్ లో పనిచేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ముక్కలు ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటది ఇలా వస్తాడు అని. కానీ సినిమా తీసేటప్పుడు అతని సత్తా తెలిసింది.
ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ అది నేను కాదు. మొదటి స్టార్ సుజిత్. ఫస్ట్ క్రెడిట్ సుజిత్ కు ఇవ్వాల్సిందే. సుజిత్ కలను నిజం చేయడానికి సపోర్ట్ చేసింది తమన్. వీళ్లిద్దరూ ఈ సినిమాకి స్టార్స్. వీళ్ళిద్దరూ చాలా పిచ్చితో ఈ సినిమా కోసం పనిచేశారు. వీరిద్దరూ కూడా సినిమా అంతా ఒక స్ట్రిప్ లో ఉన్నారు. అని పవన్ కళ్యాణ్ తన మాటల్లో చెప్పారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరో మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలన్నిటిని కూడా ఈ సినిమా నిలబెడుతుంది అని బలంగా నమ్ముతున్నారు.
Also Read : OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు