OG Movie : దాదాపు మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజి. ఈ సినిమా గురించి ఎదురు చూడటానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.
వాస్తవానికి ఒక రీమేక్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ కాంపౌండ్ లోకి చేరాడు సుజిత్. అయితే ఏదైనా కథ నీ దగ్గర ఉందా అని అడిగినప్పుడు, ఓజాస్ గంభీర కథను పవన్ కళ్యాణ్ కు చెప్పడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ కు అది నచ్చడంతో తనతో సినిమా చేసే అవకాశం సుజీత్ కు ఇచ్చారు.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నారు డి వి ఎంటర్టైన్మెంట్స్. ఈ సినిమా సంబంధించి హుడీస్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే చాలామంది యువత హుడీస్ ను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. అలానే హెడ్ బ్యాండ్ కూడా బుక్ చేసుకున్నారు. ట్రైలర్ ఈరోజు వస్తుంది అని అనౌన్స్ చేశారు ఇప్పటివరకు ట్రైలర్ రాలేదు. గట్టిగా మాట్లాడితే వస్తుందో లేదో క్లారిటీ కూడా లేదు. సెన్సార్ అప్డేట్ ఇవ్వలేదు. యూఎస్ కి ప్రింట్స్ వెళ్లలేదు. అయితే ఈ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఇలా ఇన్స్టాల్మెంటులో మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒకేసారి చంపేయొచ్చు కదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
పైన ఉదహరించినట్లుగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ సినిమాకు సంబంధించి ఉన్నాయి. కానీ సరైన క్లారిటీ ఈ సినిమా విషయంలో ఇవ్వడం లేదు. మూడు సంవత్సరాల కింద మొదలైన ప్రాజెక్ట్ మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది అనుకున్న తరుణంలో డబ్బింగ్ జరగటం. ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ కాకపోవడం అభిమానులకు చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలన్నీ కూడా ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ కన్సర్ట్ లో రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు అది ఏ రేంజ్ లో ఉండబోతుందో కాసేపట్లో అర్థం అవుతుంది.
Also Read : Bigg Boss 9: మనీష్ ను మించిన వరస్ట్ సంచాలక్.. పాపం సుమన్ శెట్టిను ఎలిమినేట్