Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా విడుదలకు అన్ని రకాలుగా సిద్ధమైంది. మార్చి 14న సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. అలాగే, మార్చి 15న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ఏపీ ప్రభుత్వం (AP Government) ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 18న కాకుండా, సినిమా విడుదలవుతున్న మార్చి 19 ఉదయం 4, 5 గంటల మధ్యలో బెనిఫిట్ షోకు అనుమతి ఇస్తూ, ఆ షో టికెట్ ధర రూ. 500గా నిర్ణయించింది. ఒకప్పుడు ఇలానే బెనిఫిట్ షోలు పడేవి. ఈ మధ్యకాలంలో ఒక రోజు ముందే వేస్తున్నారు కానీ, ఈ సినిమా విషయంలో మళ్లీ నార్మల్‌గా అంతా జరుగుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా టికెట్ల ధర పెంపుపై సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Godari Gattupaina: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్రల మ్యాజికల్ మెలోడీ ‘బంగారు బొమ్మ’.. ఎలా ఉందంటే?
అవేంటంటే.. అసలే యుద్ధం ఎఫెక్ట్‌తో ఎక్కడికక్కడ ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్యాస్ లేక హోటల్స్, హాస్టల్స్ కూడా మూసేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ కూడా చాలా చోట్ల దొరకడం లేదు. కొన్ని చోట్ల లభించినా, భారీ ధరకు బ్లాక్‌లో అమ్మే పరిస్థితి నడుస్తుంది. ఈ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాలపై ఉంది. మరి ఇలాంటి సమయంలో టికెట్ల ధర పెంపు అవసరమా? అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులే సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఒక్క సినిమాను నార్మల్ ధరలతో రిలీజ్ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నిజమే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. మళ్లీ లాక్‌డౌన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు యుద్ధం ఆగుతుందో.. మళ్లీ ఎప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంటుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ యుద్ధంపై దేశ, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Chandini Chowdhary: పెళ్లికి సిద్ధమైన చాందినీ చౌదరి.. ఇందులో నిజం ఎంత..?
అందుకే, ఈ మధ్య థియేటర్లకు కూడా జనాలు రావడం లేదు. ఈ క్రమంలో సంక్రాంతి సినిమాల తర్వాత వస్తున్న పెద్ద చిత్రమిదే. ఈ టెన్షన్స్ మధ్య కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకునే వాళ్లకి, సినిమా టికెట్ల ధరలు భయపెడుతున్నాయి. మరి ఇది సినిమా టీమ్, పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ ప్రభుత్వం గమనిస్తే మంచిది. మరోవైపు తెలంగాణలో కూడా టికెట్ల ధరల పెంపు నిమిత్తం కసరత్తులు నడుస్తున్నాయి. సుప్రీం కోర్టు కూడా దీనిపై కలగజేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో పెరిగిన ధరలను గమనిస్తే.. మార్చి 19 నుంచి 28 వరకూ పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశాన్నిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంతేకాదు, 10 రోజుల పాటు 5 షోలకు కూడా అనుమతులు లభించాయి.
Also Read- Chiranjeevi: ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరన్నారుగా.. మరి చిరంజీవినే ఎందుకు కలుస్తున్నారు?